Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్, మెడికల్ కాలేజ్ డాక్టర్ అందర్, ఏం జరిగిందంటే ?

బెంగళూరు/కోలారు/బళ్లారి: ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత ఉన్నత చదువుల కోసం ప్రముఖ మెడికల్ కాలేజ్ లో చదువుతూ ఉద్యోగం చేస్తున్న యువతి ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసులో అదే మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న సీనియర్ డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇంకా నాలుగురు లేదా ఐదు మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని స్వయంగా పోలీసులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు రూరల్ జిల్లా హోస్ కోటేలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్న విద్యార్థిని దర్శిని కోలార్ తాలూకాలోని కెందట్టి గ్రామంలో క్వారీలో పడి ఆత్మహత్య చేసుకుంది. హోస్ కోటే లోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ ఎండీ చేస్తున్న దర్శిని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

The police investigating the lady doctors suicide case have arrested a medical college doctor in Kolar.

గత ఆదివారం ఉదయం కాలేజీ వదిలి నేరుగా కోలార్ తాలూకా కెందట్టి సమీపంలోని క్వారి దగ్గరకు వెళ్లింది. చెప్పులు, మొబైల్ ఫోన్ తీసి క్వారీ బయటపెట్టింది. అదే సమయంలో తన స్నేహితుడు మణికి ఫోన్ చేసిన దర్శిని తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతున్నానని చెప్పంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని దర్శిని ఆమె స్నేహితుడు మణికి చెప్పింది.

అ సమయంలో మణి స్నేహితురాలు దర్శిని తల్లితో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ దర్శిని కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. మళ్లీ ఎంత ప్రయత్నించినా దర్శిని కాల్ రిసీవ్ చేసుకోలేదు. అప్పటికే దర్శిని క్వారీలోని నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో ప్రతిభ కనబరిచిన దర్శిని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉచితంగా ఎండీ సీటు సాధించింది. అదనంగా, ఆమె పెద పిల్లల కోసం స్పెషలిస్ట్‌గా పనిచేయాలని ఆశపడింది.

తండ్రిని కోల్పోయిన దర్శిని తల్లి ఆశ్రయంలో పెరిగింది. దర్శిని తల్లి రాజేశ్వరి ప్రభుత్వ స్కూల్ లో టీచర్‌గా పనిచేస్తూ కూతుర్ని డాక్టర్‌ని చేయాలనే కోరిక మేరకు చదివిస్తోంది. దర్శిని 7 నెలల క్రితమే ఎంవీజే మెడికల్ కాలేజీలో చేర్పించారు. వైద్య కళాశాలలో విశ్రాంతి లేకుండా 48 గంటల పాటు కంటిన్యూగా పనిచేయాల్సి వచ్చిందని, ప్రతిరోజు మధ్యాహ్న పూట సక్రమంగా భోజనం కూడా పెట్టడం లేదని దర్శిని ఇప్పటికే ఆమె స్నేహితులకు చెప్పింది.

మెడకల్ కాలేజ్ లో పని చేసే సీనియర్ డాక్టర్ మహేష్ తనను వేధిస్తున్నాడని, రాత్రికి ఫోన్ చెయ్యండి అంటూ దర్శినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లి ఆరోపించారు. ఇన్ని వేధింపులు జరిగినా కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇంటర్నల్ మార్కులు రావనే భయంతో వేధింపుల విషయం గురించి కుటుంబసభ్యులకు చెప్పలేదని, స్నేహితుడు మణికి దర్శిని ఆమె బాధను చెప్పుకుందని తెలిసింది. ఎంవీజే కళాశాల పాలకమండలి, సీనియర్ డాక్టర్ మహేష్ మీద దర్శిని తల్లి కేసు పెట్టడంతో పోలీసులు కేసు విచారణ చేశారు.

ఫ్రీ మెడికల్ సీటు పొంది ప్రతిభ కనబరిచిన విద్యార్థిని డాక్టర్ దర్శిని మృతికి కారణమైన ఎంవీజే మెడికల్ కళాశాల యాజమాన్యంపై, సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోలారు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.సురేష్ బాబు డిమాండ్ చేశారు. మెరిట్ ఆధారంగా ప్రభుత్వ కోటా కింద చదువుకుంటున్న దర్శిని ఓస్కూల్ టీచర్ కూతురు అని గర్తు చేశారు.

The police investigating the lady doctors suicide case have arrested a medical college doctor in Kolar.

డాక్టర్ దర్శిని మృతికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసుకు సంబంధించి కోలార్ జిల్లా పోలీసు శాఖ, ఎస్పీ తీసుకున్న చర్యలు స్వాగతించదగినవి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతిభావంతులైన చిన్నారుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా చట్టం తీసుకురావాలని సురేష్ బాబు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+