నేడు తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని..
నేడు తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని : నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ప్రధానమంతి మంగళ, బుధవారాల్లో తమిళనాడు, లక్ష్యదీప్ ప్రాంతాలను పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని అత్యంత సుందరమైన తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్‌ను నేడు ప్రారంభించనున్నారు.
ఈ నూతన టెర్మినల్ భవన నిర్మాణం కోసం సుమారు రూ. 1,100 కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. ప్రతి ఏటా 44 లక్షల మంది ప్రయాణీకులు ఈ టెర్నినల్ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకుంటారు. వీటితోపాటు తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్శిటీ 38వ స్నాతకోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొననున్నారు. ఏవియేషన్, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్ , ఉన్నత విద్యా రంగాలకు సంబంధించి 20 వేల కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు, 5 బ్యాగేజ్ క్యారౌసెల్‌లు, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఎమిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇతర మౌళిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు : ఈ విమానాశ్రయం ప్రతి రోజు 3,500 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. ఈ కొత్త టెర్మినల్ ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉంది. ఈ విమానాశ్రయంతో పాటు తమిళనాడుకు రైలు, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలను కలుపుతూ పలు రైలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించనున్నట్లు సమాచారం.
వీటితో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన కేంద్రాలు, ఓడ రేవులకు కనెక్టివిటిని మెరుగు పరిచేవిధంగా కృషిచేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రోడ్డులోని ఓడ రేవులను కలుపుతూ ముగాయ్యూర్ నుండి మరక్కానం వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులకు కూడా మోడీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రూ. 9 వేల కోట్లకు పైగా విలువైన పెట్రోలియం, సహజవాయువు ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి నేడు శంకుస్థాపన చేయనున్నారు. కల్పక్కంలో ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 400 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసిన డెమోన్ స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ప్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications