ఆ ఎంపీల ఆస్తుల విలువ భారీగా పెరిగింది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆస్తుల విలువ ఎంతంటే !
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత ఇరవై ఏళ్లలో ఆస్తులు పెరిగిన ఎంపీల జాబితా వెల్లడైంది. ఒక నివేదిక ప్రకారం 2004 నుండి తిరిగి ఎన్నికైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనకా గాంధీ సహా 23 మంది ఎంపీల మొత్తం ఆస్తి విలువ రూ. 35.18 కోట్ల నుంచి రూ. 402.79 కోట్లకు పెరిగిపోయిందని వెలుగు చూసింది. పలువురు ఎంపీల ఆస్తులు భారీగా పెరిగిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం కర్ణాటక ఎంపీల ఆస్తుల విలువ కూడా బాగానే పెరిగింది. కర్ణాటకలోని విజయపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగి ఆస్తుల విలువ గరిష్ఠంగా పెరిగింది. 2004లో బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగికి రూ. 54.8 లక్షల ఉన్న ఆస్తి విలువ 2019 నాటికి ఆయన ఆస్తి విలువ రూ. 50.41 కోట్లు అయ్యిందని ఆ నివేదిక పేర్కొంది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం కర్ణాటకలో ఆరుగురు ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయి. ఈ ఎంపీలు 2004 నుంచి లోక్ సభ ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్ జిగజినాగి (విజయపూర్) రూ.54.8 లక్షల ఆస్తి విలువ రూ.50. 41 కోట్లకు పెరిగింది. కేంద్ర మాజీ మంత్రి డీవీ.సదానంద గౌడ (బెంగళూరు నార్త్ ఎంపీ) ఆస్తి విలువ రూ. 46. 39 లక్షల నుండి రూ. 20. 93 కోట్లు పెరిగింది.
ఎంపీ జీఎం సిద్దేశ్వర్ (దావణగెరె) ఆస్తి రూ. 5. 02 కోట్ల నుంచి రూ. 38. 01 కోట్లు పెరిగింది. కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి (ధారవాడ) ఆస్తి విలువ రూ. 77. 60 లక్షల నుండి రూ. 11.13 కోట్లు పెరిగింది. బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే (ఉత్తర కన్నడ) ఆస్తి విలువ రూ. 12. 06 లక్షల నుండి రూ. 8. 47 కోట్లకు పెరిగింది. పిసి గడ్డిగౌడ్ (బాగలకోట్) ఆస్తి విలువ రూ. 53. 75 లక్షల నుండి రూ. 4 39 కోట్లకు పెరిగింది.

2004 నుంచి తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపీల్లో 17 మంది బీజేపీకి చెందిన నాయకులే ఉన్నారు. ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి, ఏఐఎంఐఎం, శివసేన, బీజేడీలకు ఒక్కో ఎంపీ ఉన్నారు. ఈ ఎంపీలందరి సగటు ఆస్తి విలువ 2004లో రూ.1. 52 కోట్లు ఉండగా 2009లో రూ.3. 46 కోట్లకు పెరిగింది. ఎంపీల ఆస్తులు వివరాలు తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల ఆస్తుల విలువ ఇంతేనా ? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆస్తి విలువ 2004లో రూ. 55.38 లక్షలు, 2009లో రూ. 2. 32 కోట్లు, 2014లో రూ. 9. 4 కోట్లు, 2019లో రూ. 15. 88 కోట్లు పెరిగింది. గత 15 ఏళ్లలో రాహుల్ గాంధీ ఆస్తి విలువ 2,769 శాతం పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ. 85. 68 లక్షల నుంచి రూ.11. 82 కోట్లు (1,280 శాతం) ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం మీద ఇంతపెద్ద పెద్ద నాయకుల ఆస్తుల వివరాలు ఇంత తక్కువగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications