Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: రెండో భార్య నిషాతో ?, భార్య, పిల్లలను చంపేసి ఇంట్లో పూడ్చేసి శవాల మీద రైల్వే ఉద్యోగి, టైల్స్ తో !

ఇండోర్/మధ్యప్రదేశ్: రెండో భార్య ఇంట్లోనే ఉంటున్న అతను రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో మహిళ, ఆమె పిల్లలకు కనపడకపోవడంతో, ప్రతిరోజు భర్త మాత్రమే ఉద్యోగానికి వెళ్లి వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చివరికి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, మెజిస్ట్రేట్ ఎంట్రీతో స్థానికులు హడలిపోయారు. మాయం అయిన తల్లీ, బిడ్డలను అదే ఇంటి ఆవరణంలో పూడ్చి పెట్టేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. భార్య, ఇద్దరు పిల్లల శవాలను ఇంట్లోనే పూడ్చి పెట్టిన కిరాతకుడు సైలెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

మొదటి భార్యకు గుడ్ బై

మొదటి భార్యకు గుడ్ బై

మధ్యప్రదేశ్ లోని రత్లామ్ ఏరియాలో సోనూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోనూ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సోనూ ఖచ్రోడ్ లోని రైల్వే డివిజన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న సోనూ అతని భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేశాడు. సోనూ దంపతులకు పిల్లలు ఉన్నారు. భార్యతో తేడాలు రావడంతో సోనూ దంపతులు విడిపోయారు.

రెండో పెళ్లి చేసుకున్నాడు

రెండో పెళ్లి చేసుకున్నాడు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన సోనూ తరువాత నిషా అనే మహిళను 2014లో రెండో పెళ్లి చేసుకున్నాడు. సోనూ అతని రెండో భార్య నిషాతో హ్యాపీగా సంసారం చేశాడు. సోనూ, నిషా దంపతులకు అమన్ (7), ఖుషి (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్య నిషా, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న సోనూ ప్రతినిత్యం రైల్వే శాఖలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తున్నాడు.

50 రోజుల నుంచి తల్లీ, పిల్లలు మాయం

50 రోజుల నుంచి తల్లీ, పిల్లలు మాయం

ఒకటిన్నర నెల నుంచి సోనూ ఒక్కడే అతని ఇంట్లో ఉంటున్నాడు. సోనూ రెండో భార్య నిషా, ఆమె ఇద్దరు పిల్లల ఆచూకి ఏమాత్రం లేదు. నిత్యం ఇంటి నుంచి బయటకు వస్తున్న నిషా చుట్టుపక్కల ఉన్న వాళ్లతో మాట్లాడుతోంది. అయితే ఇన్ని రోజులు నిషా కనపడకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. మనకు ఎక్కడ వచ్చి గొడవలే అని చాలా మంది సైలెంట్ గా ఉండిపోయారు.

పోలీసుల ఎంట్రీతో ?

పోలీసుల ఎంట్రీతో ?

ప్రతిరోజు సోనూ మాత్రమే ఉద్యోగానికి వెళ్లి వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి మీ భార్య నిషా, పిల్లలు ఎక్కడికి పోయారు అని సోనూను ప్రశ్నించారని తెలిసింది. అయితే సోనూ మాత్రం వారికి సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది, సోనూ రెండో భార్య నిషాకు క్లోజ్ గా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సామాచారం ఇచ్చాడు. పోలీసులు మెజిస్ట్రేట్ ను వెంటపెట్టుకుని సోనూ ఇంటికి వెళ్లారు. మీ భార్య నిషా, పిల్లలు ఎక్కడ అని సోనూను ప్రశ్నించారు.

50 రోజుల క్రితమే హత్య

50 రోజుల క్రితమే హత్య

నా భార్య, పిల్లలు ఊరికి వెళ్లారని సోనూ మొదట పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నా రెండో భార్య నిషాతో పాటు ఇద్దరు పిల్లలను 45 రోజుల క్రితం హత్య చేసి ముగ్గురి శవాలు ఇంటి వెనుక పూడ్చి పెట్టానని సోనూ చెప్పడంతో పోలీసులు, స్థానికులు హడలిపోయారు.

రెండో భార్యను ఎందుకు చంపేశాడు ?

రెండో భార్యను ఎందుకు చంపేశాడు ?

పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో నిషా, ఆమె ఇద్దరు పిల్లల శవాలు బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భార్య నిషాదో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన తరువాత సోనూ కొందరు కూలీలను సంప్రధించాడు. ఇంటి ఆవరణంలో నీటి సంప్ కట్టాలని చెప్పి గోతి తవ్వించాడు. తరువాత స్నేహితుడు బంటీ కేత్వాస్ అలియాస్ బంటీకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న సోనూ అతని సహాయంతో భార్య నిషాతో పాటు ఇద్దరు పిల్లల శవాలు నీటి సంప్ కోసం తీసిన గోతిలో పూడ్చిపెట్టాడు.

దుర్వాసన రాకుండా టల్స్ వేసి ప్యాక్ చేసిన క్రిమినల్

దుర్వాసన రాకుండా టల్స్ వేసి ప్యాక్ చేసిన క్రిమినల్

మూడు శవాల నుంచి దుర్వాసన రాకుండా పైన టైల్స్ వేశామని పోలీసుల విచారణలో సోనూ అంగీకరించాడు. మొదటి భార్యకు సోనూకు ఆస్తి పంపకాల్లో గొడవలు ఉన్నాయని, ఈ వియం కోర్టు విచారణలో ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రెండో భార్య నిషాను సోనూ ఎందుకు హత్య చేశాడు ? అని ఇంకా కచ్చితంగా తెలియడం లేదని, సోనూను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. సోనూ స్నేహితుడు బంటీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+