Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇందిరా మెచ్చిన 'బ్లాక్ టైగర్'.. రా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మిషన్!

వెండితెరపై మనం చూసే 'దురంధర్' వంటి సినిమాలు.. గూఢచారి పాత్రలు ధైర్యానికి, తెలివితేటలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. కానీ, కల్పిత పాత్రలను మించిన సాహసం, ఊహకందని త్యాగం కలగలిసిన ఒక వాస్తవ గాథ భారతదేశ ఇంటెలిజెన్స్ చరిత్రలో నిక్షిప్తమై ఉంది. ఆయనే రవీంద్ర కౌశిక్.

భారత గూఢచారిగా పాకిస్థాన్ సైన్యంలోకి చొరబడి, అక్కడే మేజర్ ర్యాంకుకు ఎదిగి, దశాబ్ద కాలం పాటు భారత్‌కు కీలక సమాచారాన్ని అందించిన 'అజేయ వీరుడు'. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేత "బ్లాక్ టైగర్" అని పిలిపించుకున్న ఈ అదృశ్య సైనికుడి జీవితం నేటికీ స్పూర్తిదాయకం, హృదయవిదారకం.

The Real Black Tiger How Ravindra Kaushik Infiltrated the Pakistan Army and Became a Major for RAW

రంగస్థలంపై నటన.. రా (RAW) ఏజెంట్‌గా ఎంపిక!

1952లో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్‌కు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ప్రాణం. 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ స్థాయి నాటక పోటీలో, శత్రువుల చిత్రహింసలను ఎదుర్కొనే భారత సైనికుడిగా ఆయన చేసిన నటన 'రా' (RAW) అధికారులను ఆకర్షించింది. ఆయనలోని భాషా ప్రావీణ్యం, మానసిక దృఢత్వాన్ని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, దేశం కోసం ఒక అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ఆయనకు అప్పగించాయి.

26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్

నబీ అహ్మద్‌గా రూపాంతరం.. పాక్ సైన్యంలోకి చొరబాటు!

రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రవీంద్ర కౌశిక్ తన గతాన్ని పూర్తిగా చెరిపేసుకున్నారు. ఉర్దూ భాష, ఇస్లామిక్ ఆచారాలు నేర్చుకుని 'నబీ అహ్మద్ షకీర్'గా మారి 23 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ కరాచీ యూనివర్సిటీలో లా పూర్తి చేసి, ఏకంగా పాకిస్థాన్ ఆర్మీలో చేరారు. తన తెలివితేటలతో మిలిటరీ అకౌంట్స్ విభాగంలో మేజర్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో స్థానిక మహిళ అమానత్‌ను వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. కానీ, లోపల మాత్రం ఆయన నిరంతరం భారత్ కోసం శ్వాసించే గూఢచారిగానే మిగిలారు.

కీలక సమాచారం.. ఇందిరా గాంధీ ప్రశంసలు!

1979 నుంచి 1983 మధ్య కౌశిక్ అందించిన సమాచారం భారతదేశానికి వ్యూహాత్మకంగా వెలకట్టలేనిది. పాక్ సైనిక మోహరింపులు, వ్యూహాలు, రహస్య అణు కేంద్రమైన 'కహూటా'కు సంబంధించిన సమాచారాన్ని ఆయన భారత్‌కు చేరవేశారు. ఆయన సేవలకు ముగ్ధురాలైన నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు "బ్లాక్ టైగర్" అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. ఒక గూఢచారికి అప్పట్లో లభించిన అత్యున్నత గౌరవం అది.

'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?

ఒక్క పొరపాటు.. రెండు దశాబ్దాల నరకం!

అయితే, 1983లో భారత్ పంపిన మరో ఏజెంట్ పొరపాటు వల్ల కౌశిక్ అసలు నిజం పాక్ అధికారులకు దొరికిపోయింది. అరెస్టయిన తర్వాత ఆయనను సియాల్‌కోట్, కోట్ లఖ్‌పత్ వంటి జైళ్లలో ఉంచి దారుణంగా హింసించారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆయన నోరు విప్పలేదు. 16 ఏళ్ల పాటు చీకటి గదుల్లో నరకం అనుభవించిన కౌశిక్, జైలు నుంచి తన కుటుంబానికి రాసిన లేఖలు కన్నీళ్లు తెప్పిస్తాయి. "భారత్ వంటి దేశం కోసం త్యాగాలు చేసే వారికి చివరకు లభించేది ఇదేనా?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గుర్తు తెలియని సమాధిలో నిశ్శబ్ద నిద్ర!

తీవ్రమైన క్షయ వ్యాధి, గుండె జబ్బుతో బాధపడుతూ 2001 నవంబర్ 21న పాకిస్థాన్‌లోని మియాన్వాలీ జైలులో రవీంద్ర కౌశిక్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత కూడా భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక గుర్తింపు లభించలేదు. తాను ప్రేమించిన దేశానికి దూరంగా, ఒక గుర్తు తెలియని సమాధిలో ఆయన ఖననం చేయబడ్డారు. నేటికీ ఆయన కుటుంబం ఆ వీరుడి సేవలకు తగిన గౌరవం కోసం పోరాడుతూనే ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+