Punjab: రూ. 8.49 కోట్లు దొచుకున్న దొంగలను పట్టించిన రూ.10 ఫ్రూటీ..

ఎంత పెద్ద తప్పు చేసినా దొరకని వారు చిన్న తప్పుతో దొరికిపోతారు. తాజాగా ఓ చిన్న తప్పుతో రూ.8.49 కోట్లు దొంగతనం చేసిన దంపతులు పోలీసులకు దొరికిపోయారు. పది రూపాయల విలువైన ఫ్రూటీ ఆశపడి వారు పోలీసులకు పట్టుబడ్డారు. పంజాబ్ లోని లూథియానాలో జూన్ 10న సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ చెందిన రూ. 8.49 కోట్లను డాకూ హసీనా అలియాస్ మన్ దీప్ కౌర్ దొంగలించింది. ఆ డబ్బు తీసుకుని భర్తతో కలిసి నేపాల్ పారిపోవాలని నిర్ణయించుకుంది.

భర్త జస్వీందర్ తో కలిసి నేపాల్ కు పయనమైంది. అయితే మార్గ మధ్యలో దేవుళ్లను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ దొంగతనం కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు కోసం బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు నేపాల్ వెళ్తున్నారని తెలుసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులో అలెర్ట్ చేశారు. అలాగే రోడ్డుపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నిందితులు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నట్లు తెలిసి పలు బృందాలు బయల్దేరాయి.

The robbers who were running away with Rs.8.49 crores were caught by the police after giving them a fruity drink of Rs.10

నిందితులు హరిద్వార్, కేదార్ నాథ్, హేమ్ కుండ్ క్షేత్రాలను దర్శించుకున్నట్లు పోలీసులు విచారణ తేలింది. నిందితులు హేమ్ కుండ్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకోడం ఎలా అని తలలు పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడి నిత్యం వేలలో భక్తులు వస్తారు. అయితే పోలీసులు చివరికి ఒక ఐడియా వచ్చింది. వారు ఓ బృందంగా ఏర్పాడి అక్కడ ఫ్రూటీ కూల్ డ్రింక్ ను ఫ్రీ అందించారు. చాలా మంది వచ్చి ఫ్రీ ఫ్రూటీ డింక్ తాగారు.

ఫ్రూటీ తాగాడానికి నిందితులు కూడా వచ్చారు. అయితే వారు ముఖానికి అడ్డుగా గుడ్డ కట్టుకోవడంతో వారిని గుర్తించ లేదు. అయితే వారు ఫ్రూటీ తాగడానికి ముఖం పై గుడ్డ తీయడంతో దొరికిపోయారు. అయితే అక్కడే పట్టుకుంటే గొడవ జరిగే అవకాశం ఉండడంతో వారిని వెంబడించి.. ఓ చోట పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5.75 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల స్నేహితుడు గౌరవ్ అలియాస్ గుల్షన్‌ను గిద్దర్‌బాహా నుంచి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

"పరారీలో ఉన్న మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత CMS నగదు దోపిడీ కేసును ఛేదించిన లూథియాన పోలీసులు & కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అభినందనలు. లూథియానా క్యాష్‌వాన్‌ దోపిడీ కింగ్‌పిన్‌ను 100 గంటలలోపే అరెస్టు చేశారు. పంజాబ్‌లోని న్యూ రాజ్‌గురు నగర్‌లోని క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీ కార్యాలయంలో దొంగలు రూ.8.49 కోట్లు దోచుకుని పరారయ్యారు" అని డిజిపి యాదవ్ ఒక ట్వీట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+