ఏటీఎం సేఫ్టీ డోర్ కు సేఫ్టీ లేదు, జస్ట్ రూ. 24 లక్షలు లూటీ, సెంట్రల్ జైలు పక్కలో !
బెంగళూరు: ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లూటీ చేసే కేటుగాళ్లు ఎక్కువ అవుతున్నారు. ఏటీఎం యంత్రాల్లో లక్షలు లక్షల డబ్బులు ఉంటుందని తెలుసుకుంటున్న నిందితులు ఏటీఎం యంత్రాలనే టార్గెట్ చేస్తున్నారు. ఏటీఎం మంత్రాల దగ్గర సెక్యూరిటీ గార్డుల కాపలా, సీసీటీవీ కెమెరాలు ఉన్నా నిందితులు మాత్రం ఏమాత్రం బయటపడకుండా ఏటీఎం యంత్రాల్లోని డబ్బులు ఎత్తుకుని వెళ్తిపోతున్నారు.
ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని ఏటీఎం యంత్రాలను నిందితులు టార్గెట్ చెయ్యడం ఎక్కువ అవుతున్నాయి. ఏటీఎం యంత్రం పగలగొట్టిన నిందితులు లక్షల రూపాయలు ఎత్తుకుపోవడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు సెంట్రల్ జైలు సమీపంలోనే ఏటీఎం యంత్రంలో నగదు లూటీ కావడంతో పోలీసులు హడలిపోయారు.

రాత్రి ఏటీఎం కేంద్రంలోని వెళ్లిన గుర్తు తెలియన నిందితులు ఏటీఎం యంత్రం సేఫ్టీ డోర్ చాకచక్యంగా తీసేసి అందులో ఉన్న రూ. 24 లక్షల రూపాయలు లూటీ చేసి సైలెంట్ గా వెళ్లిపోయారు. బ్యాంకు సిబ్బందికి సమాచారం అందండంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి తరువాత పరప్పన అగ్రహార పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జులై 6వ తేదీన ఈ సంఘటన జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటీఎం యంత్రం ఉన్న ప్రాంతలోని సీసీటీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించిన పోలీసులు ఏటీఎంలో నగదు లూటీ చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎం యంత్రంలో నగదు లూటీ అయిన ప్రాంతం సమీపంలోనే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు కూడా ఉంది.












Click it and Unblock the Notifications