ఎన్నికల వేళ.. భారత్‌లో చాప కింద నీరులా విస్తరించిన చైనా

India China border dispute: చైనా.. మరోసారి భారత్‌పై విషాన్ని కక్కింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ అలాంటి తెంపరితనాన్నే ప్రదర్శించింది. సరికొత్త వివాదానికి బీజం వేసింది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించింది.

లఢక్ మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకూ సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా భారత్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న చైనా.. గతంలో పలుమార్లు వివాదాలకు కారణమైంది. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తనలో కలిపేసుకున్నట్లు మ్యాప్‌లను విడుదల చేసింది. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో గ్రామాలను సైతం నిర్మించింది.

The Satellite Images shows the China is building a road in illegally occupied Kashmir

కేంద్ర పాలిత పాంతం లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్‌ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి దుందుడకు చర్యలను ప్రదర్శించింది చైనా. ఈ సారి జమ్మూ కాశ్మీర్‌ను తన లక్ష్యంగా మార్చుకుంది. చాపకింద నీరులా తన హద్దులను మరింత విస్తరించుకుంటూ పోతోంది.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై కొత్తగా రోడ్లను నిర్మించింది చైనా. భారత్- పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకం, సున్నిత సరిహద్దు ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ సమీపంలో గల షక్స్‌గామ్ వేలీ సమీపంలో ఈ రోడ్డును వేసింది. దీనికి సంబంధించిన కొన్ని శాటిలైట్ ఫొటోలను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియా టుడే తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్ బాల్టిస్టాన్‌ నుంచి తమ దేశంలోని గ్ఝిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ను కలుపుతూ ఇప్పటికే ఉన్న జీ219 నంబర్ జాతీయ రహదారిని షక్స్‌గామ్ వేలీ వరకూ పొడిగించింది. సియాచిన్ గ్లేసియర్ సమీపంలో గల ఇందిరా కోల్ వెస్ట్ సరిహద్దకు 50 కిలోమీటర్ల దూరం నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మించినట్లు శాటిలైట్ ఇమేజీలు స్పష్టం చేశాయి.

ఈ శాటిలైట్ ఫొటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని మాజీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ రాకేష్ శర్మ ధృవీకరించారు కూడా. అక్రమంగా ఈ రోడ్డును నిర్మించిందని తేల్చి చెప్పారు. భారత్.. తన నిరసనను చైనాకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సిక్కిం సమీపంలో నకులా పాస్ వద్ద చైనా ఆర్మీ కొత్తగా నిర్మించిన కొత్త పోస్టులు, ఆర్మీ శిబిరాల నిర్మాణానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. భారత్-చైనా-భూటాన్ సరిహద్దుల్లో ట్రై జంక్షన్‌గా గుర్తింపు ఉన్న డోక్లామ్ ప్రాంతంలోని గ్రౌండ్ జీరో వద్దా ఇలాంటి రోడ్ల నిర్మాణం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+