రెండో మొగుడు ఫేమస్ కంపెనీ ఎండీ, అక్రమ సంబంధంతో ఏం జరిగిందంటే ?
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని పీణ్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ గృహిణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు పవిత్ర (30 అని పోలీసులు అన్నారు.
కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న పవిత్రా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, కుటుంబ సభ్యులు అందరూ బయటకు పోవడంతో ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పవిత్రా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బెంగళూరులోని పీణ్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తన భర్త, అతని ప్రియురాల తన ఆత్మహత్యకు కారణం అని డెత్ నోట్ రాసిన పవిత్రా ఆత్మహత్య చేసుకుంది. భర్త చేతన్ గౌడ అక్రమ సంబంధం కారణంతో విసుగు చెందిన అతని భార్య పవిత్రా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హెగ్గనహళ్లిలో నివాసముంటున్న పవిత్ర అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
డెత్ నోట్ రాసి ఆ డెత్ నోట్ వాట్సాప్ స్టేటస్ పెట్టిన పవిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన పవిత్ర తరువాత చేతన్ గౌడను రెండో పెళ్లి చేసుకుంది. చేతన్ గౌడ సుముక్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని. గతంలో ఇదే కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న పవిత్ర తరువాత చేతన్ గౌడ మోజులో పడిపోయింది.

అప్పటికే వివాహం చేసుకున్న పవిత్రా చేతన్ గౌడ మోజులో పడి ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత పవిత్రా ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీ యజమాని చేతన్ గౌడను రెండో పెళ్లి చేసుకుంది. చేతన్ కంపెనీలో పనిచేస్తున్న మరో యువతితో తన భర్త చనువుగా ఉంటున్నాడని, ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని పవిత్రాకు తెలిసింది.
ఈ విషయంలో భార్యాభర్తలు చేతన్ గౌడ, పవిత్రాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని పవిత్ర తన తల్లి పద్మమ్మకు చెప్పింది. తరువాత డెత్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేసిన పవిత్రా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, కూతురు పవిత్రా డెత్ నోట్ చూసిన ఆమె తల్లి పద్మమ్మ హడలిపోయి కూతురి ఇంటి దగ్గరకు పరుగు తీసింది.

ఆత్మహత్య చేసుకున్న పవిత్రా ఆమె భర్త, అతని ప్రియురాలు తన ఆత్మహత్యకు కారణం అని పవిత్రా డెత్ నోట్ రాసింది, నా కుమార్తె పవిత్ర ఆత్మహత్యకు ఆమె భర్త చేతన్ గౌడ, అతని ప్రియురాలు కారణం అని పవిత్రా తల్లి పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చేతన్ గౌడతో పాటు మరో యువతిపై కెంగేరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మృతురాలు పవిత్రా డెత్ నోట్, రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులోని నిందితుల గురించి తెలుసుకున్న స్థానికులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications