Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.

దేశాధినేత రక్షణ అంటే అది కేవలం ఒక విధి కాదు.. అదొక తపస్సు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వంత అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురైన తర్వాత, భారత భద్రతా వ్యవస్థలో సమూల మార్పుల అవసరం ఏర్పడింది. ప్రధానమంత్రికి అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు ఒక ప్రత్యేక దళం ఉండాలని భావించిన ప్రభుత్వం, బీర్బల్‌నాథ్ కమిటీ సూచనల మేరకు.. 1985, మార్చి 30న రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్వర్వుల ద్వారా కేబినెట్‌ సెక్రటేరియట్‌లో దీని కోసం 819 పోస్టులు సృష్టించారు. 1985 ఏప్రిల్ 8న 'స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్' (SPG)ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజును 'ఎస్‌పీజీ రైజింగ్‌ డే' గా నిర్వహిస్తున్నారు.

SPG లోకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో నేరుగా రిక్రూట్‌మెంట్ ఉండదు. దేశంలోని వివిధ పారామిలిటరీ దళాలైన BSF, CISF, ITBP, CRPFల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. వారు దాదాపు మూడు నెలల పాటు కఠినమైన శిక్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎంపికైన వారిలో 20 శాతం మంది కూడా చివరి వరకు నిలవలేరు. అమెరికాలోని 'సీక్రెట్ సర్వీస్' ఏజెంట్లకు ఇచ్చే శిక్షణ తరహాలోనే వీరికి కూడా శిక్షణ ఉంటుంది.

The Shield of India How SPG Commandos Undergo Rigorous Training to Protect the Prime Minister of India

నల్ల కళ్లద్దాల వెనుక రహస్యం ఏమిటి?

ప్రధాని పక్కన ఉండే ఎస్పీజీ కమెండోలు ఎప్పుడూ నల్లటి కళ్లద్దాలు ధరించి ఉంటారు. దీని వెనుక ఒక వ్యూహం ఉంది. వారు ఎవరిని గమనిస్తున్నారు, ఎటువైపు చూస్తున్నారో శత్రువులకు తెలియకూడదు. అలాగే పేలుళ్లు సంభవించినప్పుడు వచ్చే కాంతికి కళ్లు చెదరకుండా ఉండేందుకు ఇవి రక్షణనిస్తాయి. వీరు ధరించే నలుపు రంగు సూట్లు బుల్లెట్ ప్రూఫ్‌గా పనిచేస్తాయి. వీరు వాడే FN F2000 అసాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ సెకనుకు పదుల సంఖ్యలో బుల్లెట్లను కురిపించగలవు.

INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..

SPG బడ్జెట్.. అక్షరాలా కోట్లలో!

ఎస్‌పీజీకి కేటాయించే బడ్జెట్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఎస్పీజీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 400 కోట్లకు పైగా కేటాయించింది. అంటే ఒక్కో రోజుకు కోటి రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది. ఈ దళంలోని ప్రతీ కమెండో ప్రధాని కోసం తన ప్రాణాలను త్యాగం చేసేలా మానసికంగా సిద్ధమై ఉంటారు.

పినాక MkIII: భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం-చైనా పాక్‌కు దబిడి దిబిడే..!!
పినాక MkIII: భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం-చైనా పాక్‌కు దబిడి దిబిడే..!!

చట్టబద్ధమైన హోదా - మార్పులు...

1985లో ఏర్పడినప్పటికీ, 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చే వరకు దీనికి చట్టబద్ధత లేదు. మొదట్లో ప్రధాని కుటుంబ సభ్యులందరికీ ఈ భద్రత ఉండేది. అయితే, భద్రతా కారణాలు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా 2019లో చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం ప్రస్తుతం కేవలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి, వారి అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ భద్రత వర్తిస్తుంది.

దేశం ఎక్కడ ఉన్నా, ప్రధాని ఎక్కడ పర్యటించినా.. వారి రక్షణ కోసం గాలిలో, నేలపైన, నీటిలోనూ ఎస్పీజీ కమెండోలు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. 'జీరో ఎర్రర్' పాలసీతో పనిచేసే ఈ దళం, భారత భద్రతా వ్యవస్థకే గర్వకారణం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+