Bengaluru: నాన్ లోకల్ కు బ్యాడ్ న్యూస్, 60 శాతం ఉద్యోగాలు వీళ్లకేకు, సీఎం దెబ్బతో!
కన్నడ బాషకు రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని కన్నడిగులు అంటున్నారు. ప్రపంచ స్థాయిలో కూడా కన్నడకు గొప్ప గౌరవం ఉందని చెబుతున్నారు. అయితే కన్నడిగులకు నిలయమైన కర్ణాటకలో కన్నడ కనుమరుగవుతున్న తరుణంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కన్నడ బాష, కన్నడిగుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.
ఇతర రాష్ట్రాల వారి కారణంగా కన్నడిగుల ఉపాధిపై పెను ప్రభావం చూపుతుందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. బెంగుళూరులో కన్నడ కనుమరుగవుతుందనే ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని కొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా ఇతర రాష్ట్రాలు, ఇతర బాషల వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఐటీ కంపెనీల్లోనూ కన్నడ ఉద్యోగులు తక్కువగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం కన్నడిగుల ఉద్యోగాల విషయంలో అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఐటి, బీటీ కంపెనీలలో పని చేస్తున్న వారికి, పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్న కన్నడిగులకు ఇప్పుడు సిద్దరామయ్య ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతమంది కన్నడిగులకు ఉద్యోగాలు ఇచ్చారు అనే సమాచారాన్ని అన్ని కంపెనీలు బహిరంగంగా అందరికి కనపడేలా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కన్నడిగుల భూమి అయిన కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీలు వారు నిర్వహిస్తున్న సంస్థల్లో ఎంత మంది కన్నడిగులకు ఉద్యోగాలు ఇచ్చారు అని బహిరంగంగా నోటీసు బోర్డులలో వివరాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సిద్దరామయ్య ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ఎంఎన్ సీ కంపెనీలు తమ కార్యాలయం ఆవరణంలోని నోటీసు బోర్డుపై మా కంపెనీలో ఇంత మంది కన్నడిగులకు ఉద్యోగాలు ఇచ్చాము అని వివరాలు ప్రదర్శించాలని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

కన్నడ, సాంస్కృతిక శాఖా మంత్రి శివరాజ్ తంగడగి ఈ విషయాన్ని వెల్లడించారు. కన్నడ భాషా పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, కన్నడ భాషా సమగ్రాభివృద్ధి సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా శివరాజ్ తంగడగి మాట్లాడారు. కంపెనీల నోటీసు బోర్డులపై 60% కన్నడిగులకు ఉద్యోగాలు తప్పనిసరి చేసిన బిల్లు ఇది. కన్నడ భాష రక్షణ, ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని మంత్రి శివరాజ్ తంగడగి బుధవారం చెప్పారు.
కన్నడిగులకు తగినంత సంఖ్యలో ఉపాధి కల్పించేలా కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి కంపెనీలను వివరాలు చూపించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం ఆదేశిస్తుందని మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. కన్నడిగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటానికి మా ప్రభుత్వం సిద్దం అయ్యిందని మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications