మోదీకి షాక్, కాంగ్రెస్ సంచలన నిర్ణయం, రాముడు మావేడే, 100 రామ మందిరాలు
గత జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామ మందిరంలో లాల్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావడంతో బీజేపీ నాయకులు లోక్ సభ ఎన్నికల్లో మాదే గెలుపు అనే దీమాతో ఉన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావడంతో బీజేపీ జోరు మీద ఉంది.
దేశంలో బీజేపీకి అనుకూలంగా వేవ్ పెరుగుతుండడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (లోక్‌సభ ఎన్నికలు 2024) సులువుగా విజయం సాధించాలని బీజేపీ కలలు కంటోంది.

మరోవైపు హిందూ వ్యతిరేకులు అనే నినాదంతో కాంగ్రెస్‌తో సహా వాటి మిత్రపక్షాలను, ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. దీని ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో హిందూ ఓట్లను ఏకం చేసేందుకు ఇప్పటికే బీజేపీ ప్లాన్ వేసింది.
వీటన్నింటి నడుమ బీజేపీ చేస్తున్న హిందూ వ్యతిరేక నినాదానికి బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని వెలుగు చూసింది. కర్ణాటక బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన తరువాత బీజేపీని నోరు మెదపకుండా చెయ్యాలని సిద్దరామయ్య ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అవుతున్నది. కర్ణాటక బడ్జెట్‌లో ఆరాష్ట్రంలోని 100 రామమందిరాల పునరుద్ధరణకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సిద్దరామయ్య ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌లో 100 రామమందిరాలు నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కన్నడ మీడియా అంటోంది. కాంగ్రెస్ నాయకులు శ్రీరాముడి వ్యతిరేకులు అని, హిందూ వ్యతిరేకత అనే లేబుల్ నుంచి బయటపడేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిందని, లోలోపల ఈ విషయంలో అన్ని వివరాలు సేకరిస్తోందని, త్వరలో బీజేపీకి షాక్ ఇవ్వడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలిసింది.

కర్ణాటక రాష్ట్రంలోని రామమందిరాల అభివృద్ధికి ధార్మిక ధర్మాదాయ శాఖా ప్రణాళిక సిద్ధం చేసిందని, పురాతన, ప్రసిద్ధి చెందిన 100 రామమందిరాలను పునరుద్ధరించడం ద్వారా బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని తెలిసింది. అయితే కర్ణాటక ప్రభుత్వంలోని పెద్దలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా సైలెంట్ గా పని పూర్తి చెయ్యాలని చూస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications