జగన్ క్లోజ్ ఫ్రెండ్ కు చెక్, చంద్రబాబు పుట్టిన ఊరు, తిరుపతి లెక్కలు చూస్తున్న పోలీసులు ?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగిన గొడవలకు సంబంధించి వైసీపీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సినిమా చూపించాలని సిట్ అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల్లో జరిగిన గొడవలకు సంబంధించి కాల్ డేటాను సేకరించాలని సిట్ అధికారులు నిర్ణయించారని సమాచారం.
సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన తరువాత పోలింగ్ కు ఉపయోగించిన ఈవీఎంలను తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో భద్రపరిచారు. ఆ సమయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లు పరశీలించడానికి పద్మావతి యూనివర్శిటీలోకి వెళ్లారు. ఆ సందర్బంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కలిసి వాళ్ల వర్గీయులను రెచ్చగొట్టి పులివర్తి నానితో పాటు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు.

పులివర్తి నానిమీద జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పులివర్తి నాని మీద దాడికి ప్రేరిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల ప్రమేయం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్ అధికారులు నిర్ణయించారని తెలిసింది. తిరుపతిలో జరిగిన రెండు ఘటనలకు సంబంధించి సిట్ అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.
ఇప్పటికే తిరుపతి సంఘటనకు సంబంధించిన కేసులు నమోదు చేసి పలువురుని అరెస్టు చేసిన పోలీసులు వీడియో విజివల్స్, కాల్ డేటా రికార్డులు, పద్మావతి యూనివర్శిటీలో దాడులు జరిగిన సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని ఆరా తియ్యాలని సిట్ అదికారులు నిర్ణయించారని తెలిసింది. పద్మావతి యూనివర్శిటీలో గొడవలు, దాడులు జరగడం, బైక్ ను కాల్చి బూడిద చెయ్యండంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పద్మావతి యూనివర్శిటీలో కాల్పులు జరగడం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. ఇదే సమయంలో పద్మావతి యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని సిట్ అధికారులు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఫిర్యాదు దారుడు పులివర్తి నానితో పాటు ఆయన గన్ మెన్ ఇచ్చిన సమాచారం, దాడులకు సంబంధించిన ఏడు వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్, డిజిటల్ సాక్షాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
గన్ మెన్ జరిగిప కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని విచారణ చేసి విదిలేయాలా, లేక అతని పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చాలా అని సిట్ అధికారులు ఆలోచిస్తున్నారని తెలిసింది. పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రాంగణంలో రణరంగంగా తయారు కావడానికి కారణం అయిన అందరిని విచారణ చెయ్యాలని సిట్ అధికారులు రంగం సిద్దం చేసుకుంటున్నదని తెలిసింది. తిరుపతి, చంద్రగిరిలో జరిగిన సంఘటనలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి త్వరలో సినిమా కనపడుతుందని తెలిసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications