ఫోన్ కొనివ్వ‌లేద‌ని త‌ల్లిని చంపిన కొడుకు..

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు...అని ఓ సినిక‌వీ రాసిన పాట ప్ర‌స్తుతం సమాజంలో జ‌రుగుతున్న వాటికి ప్ర‌తిబింబంలా క‌నిపిస్తుంది. క‌న్న‌త‌ల్లి న‌వ‌మాసాలు మోసి బిడ్డ‌ను క‌ని పెంచుతుంది. ఒక వ‌య‌సు వ‌ర‌కు వారికి ఎలాంటి క‌ష్టం రాకుండా చూసుకుంటుంది. కానీ, ఆ త‌ల్లికి బిడ్డ‌లు ఇచ్చే గౌర‌వం ఏంటీ, నేటి స‌మాజంలోని పిల్ల‌లు త‌ల్లిదండ్రుల మీద చిన్న‌చిన్న‌వాటికే అర‌వ‌డం, వారితో గొడ‌వ‌లు ప‌డ‌డం, చివ‌రికి వారిని బ‌లితీసుకోవ‌డం వ‌ర‌కు వ‌చ్చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా డ‌బ్బులకోసం త‌ల్లిదండ్రుల‌ను చంపేసే దుస్థితికి వెళుతున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స్మార్ట్‌ఫోన్ కొనేందుకు నిరాక‌రించినందుకు త‌ల్లి ప్రాణాలు తీశాడు ఓ కొడుకు. కొడుకు అన‌డం కంటే క‌సాయి అన‌డం మేలు...

గొంతు నులిమి : ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనకు స్మార్ట్‌ఫోన్ కొనడానికి నిరాకరించినందుకు తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ఆ త‌ల్లి పేరు క‌మలాబాయి బద్వైక్ (47) ఆమె బుధవారం నాడు కొడుకు చేతిలో చ‌నిపోయింది. త‌ల‌కొరివి పెట్టాల్సిన కొడుకే ఆమె గొంతు నులిమి చంపేసాడు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ లో చోటుచేసుకుంది. క‌మలాబాయి బద్వైక్‌కు ఇద్ద‌రు కుమారులు, దీప‌క్‌, రామ్‌నాథ్‌. తన ఇద్దరు కుమారులతో కలిసి మ‌హారాష్ట్ర‌లోని ఓ ఇంట్లో జీవిస్తోంది. వారిది చాలా పేద కుటుంబం.

The son killed his mother for not buying a phone.

అయితే, దీపక్​కు స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవాలని అనిపించింది. అందుకు తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వలేదు. అతనికి కోపం వచ్చింది. మళ్లీ, మళ్లీ అడిగాడు. అయినప్పటికీ..అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ వ్యక్తికి కోపం మరింత పెరిగింది. ఆ కోపంతో సొంత తల్లిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. గుడ్డలతో ఆమె గొంతును బిగించి.. ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశాడు! విలవిలలాడుతు ఆ త‌ల్లి ప్రాణాలు విడిచింది.

పోలీసుల విచార‌ణ‌లో అస‌లు నిజం : ఆ త‌ర్వాత దీపక్‌కు రామ్‌నాథ్‌ ఫోన్​ చేసి.. తల్లికి ఒంట్లో బాలేదని, ఆసుపత్రికి తీసుకెళుతున్నట్టు చెప్పాడు. ఆగ‌మేఘాల మీద బ‌య‌లుదేరిన దీప‌క్‌కు త‌ల్లి శ‌వం ఎదుర‌య్యింది. కానీ తల్లి మృతదేహాన్ని చూసిన దీప‌క్‌ఖి అనుమానాలు మొదలయ్యాయి. ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు కనిపించడం లేదని తెలుసుకున్నాడు. సోదరుడిపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో పోలీసులను సంప్ర‌దించాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

మహిళ పోస్టుమార్టం రిపోర్టు అనంత‌రం బ‌య‌ట‌ప‌డింది అస‌లు నిజం. "దీపక్​ ఫిర్యాదుతో రామ్​నాథ్​ని విచారించాము. అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే.. సొంత తల్లిని చంపినట్టు అంగీకరించాడు," అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 28ఏళ్ల రామ్​నాథ్​ని అరెస్ట్​ చేశారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+