రాత్రి కన్నతల్లిని స్పాట్ లో చంపేసిన కొడుకు, ఏదో అనుకుంటే ఏదో చేశాడు !
బెంగళూరు/కొడుగు: వివాహం చేసుకున్న దంపతులకు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మద్యం సేవించడానికి కొడుకు బానిస అయ్యాడు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి తల్లి ఒకే ఇంటిలో ఉంటున్నది. కొడుకు డబ్బులు సంపాధించి తనను బాగా చూసుకుంటాడు అని అనుకున్న తల్లి అదే కన్న కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది.
కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేట తాలూకాలోని కట్టెపురా నది సమీపంలోని గ్రామంలో లలిత (48) అనే మహిళ నివాసం ఉంటున్నది. లలితకు రాజశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. రాజశేఖర్ అతని కన్న తల్లి లలితను చంపేశాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించి వెళ్లిన రాజశేఖర్ అతని తల్లి లలితతో కలిసి భోజనం చేసే విషయంలో గొడవపడ్డాడు.

అంతరాత్రిలో మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని రాజశేఖర్ అతని తల్లి లలితను అడిగాడు. ఇప్పటికే పీకలదాక మద్యం సేవించావని, ఇక తాగవద్దని తల్లి లలిత చెప్పడంతో ఆగ్రహించిన రాజశేఖర్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన రాజశేఖర్ అతని తల్లి లలిత తలపై కర్రతో కొట్టాడు. లలితకు తీవ్రగాయాలై రక్తస్రావం జరిగినా ఆమె కొడుకు రాజశేఖర్ ఏమాత్రం పట్టించుకోలేదు.
తీవ్రగాయాలైన తల్లి లలితను ఆస్పత్రికి తరలించకపోవడంతో రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తు దిగిపోవడంతో తల్లి లలితను హత్య చేసి పశ్చాత్తాపంతో ఏడుస్తున్న రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తొమ్మిది నెలలు కడుపులో మోస్తూ ఇంతకాలం పెంచిపోషించిన కొడుకు. కారణంగా అతని తల్లి హత్యకు గురికావడం కొడుగులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications