బాయ్ ఫ్రెండ్ కు మెసేజ్ లు చేస్తున్న తల్లిని చంపేసిన కొడుకు, రాత్రి పూట !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ మరో వ్యక్తికి దగ్గర అయ్యి అతనితో చనువుగా ఉంటున్నదని తెలిసింది. ఇదే విషయంలో ఆమె కన్న కొడుకు చేతిలో హత్యకు గురైయ్యింది.
తన తల్లి మొబైల్‌లో ఎవరికో మెసేజ్ లు పంపిస్తూ చాటింగ్ చేస్తోందనే కోపంతో ఓ కొడుకు అతని కన్న తల్లిని హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 17 ఏళ్ల బాలుడు అతని తల్లిని గొడ్డలితో హతమార్చాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని వసాయ్ టౌన్‌షిప్‌లోని పరోల్ ప్రాంతంలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

మాండవి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కాంబ్లే మాట్లాడుతూ, బాలుడు తన తల్లి సోనాలి గోగ్రా (39) ప్రవర్తనపై అనుమానం కలిగి ఉన్నాడని చెప్పారు. తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, అర్దరాత్రి ప్రియుడితో చాటింగ్ చేస్తూ మెసేజ్ లు పంపిస్తున్నదని సోనాలి కుమారుడికి చాలా కాలంగా అనుమానం ఉందని పోలీసులు అన్నారు.
సోనాలి, ఆమె కుమారుడు ఇద్దరూ తరచూ ఇదే విషయంలో గొడవ పడేవారు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆ బాలుడు తన తల్లి సోనాలి ఆమె మొబైల్ ఫోన్‌లో మరో వ్యక్తికి మెసేజ్ చేయడం గమనించి కొడుకు కోపంతో ఊగిపోయాడు. అదే రోజు రాత్రి పొద్దుపోయిన తరువాత సోనాలి బెడ్ రూమ్ లో ఒంటరిగా ఉంటూ వేరే వ్యక్తికి మొబైల్ లో మెసేజ్ చెయ్యడం గమనించిన ఆమె కొడుకు ఆవేశంతో రగిలిపోయాడు.

అనంతరం గొడ్డలి తీసుకుని వెళ్లి అతని తల్లి సోనాలి మీద ఇష్టం వచ్చినట్లు నరికేశాడని పోలీసు అధికారి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఇంట్లో లేరని ఆ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. తీవ్రంగా గాయపడిన సోనాలిని భివాండిలోని ఇందిరా గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి ఆసుపత్రి వైద్యులు సోనాలిని పరిశీలించి ఆమె మరణించిందని తెలిపారు. సోనాలి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. సోనాలిని ఆమె కొడుకు హత్య చేశాడని కేసు నమోదు చేశామని, అయితే నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని రాత్రిపూట సీక్రేట్ గా మెసేజ్ లు చేస్తోందని రగిలిపోయిన కొడుకు కన్నతల్లిని హత్య చెయ్యడం మహారాష్ట్రలో కలకలం రేపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications