Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Same Sex Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం..

స్వలింగ వివావాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై 10 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 10 రోజుల పాటు కేంద్రం, కొన్ని రాష్ట్రాలు, ఇతర పిటిషనర్లు, సంస్థల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌ చేసింది. సమగ్ర విచారణ సమయంలో కోర్టు అందరి వాదనలు విన్నది.

అత్యున్నత న్యాయస్థానాన్ని పిటిషనర్లు తమకు కావలసింది స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు మాత్రమేనని, ప్రత్యేక వివాహ చట్టం 1954లోని నిబంధనలను పునర్‌వ్యాఖ్యానించాలని సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు, పిటిషనర్లను వ్యతిరేకిస్తూ, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం కోర్టు పరిధిలో లేదని, రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత పార్లమెంటు దానిపై చట్టం చేయాలని కేంద్రం వాదించింది. దీనిని గుర్తిస్తే, పర్యవసానంగా అనేక చట్టాలను సవరించాల్సి ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

The Supreme Court has reserved its judgment on the legality of same-sex marriages

విచారణ సందర్భంగా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొదలైన రంగాలలో స్వలింగ జంటలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై పరిపాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోసం వారి అభ్యర్ధన పరిగణలోకి తీసుకొవద్దని కోరింది.

స్వలింగ వివాహాలకు సంబంధించి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించగా, స్వలింగ వివాహాల అంశంపై ఏడు రాష్ట్రాల నుంచి స్పందనలు అందాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ సమస్యను ప్రత్యేక వివాహ చట్టానికి మాత్రమే పరిమితం చేస్తామని, వ్యక్తిగత చట్టాల పరిధిలోకి ప్రవేశించబోమని బెంచ్ స్పష్టం చేసింది.

గురువారం నాటి విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్, పిటిషనర్ల కోసం తన రీజాయిండర్ సమర్పణలో, స్వలింగ వివాహానికి గుర్తింపు లేకపోవడం చట్టాల సమాన రక్షణను తిరస్కరించినట్లేనని ధర్మాసనానికి తెలిపారు. దానికి సీజేఐ ''పార్లమెంటు ఎలా స్పందిస్తుందో ఊహించి కోర్టు డిక్లరేషన్ ఇవ్వదు'' అని అన్నారు. వివాహం చేసుకునే హక్కు కంటే, యూనియన్‌లో భిన్న లింగాలు లేని జంటలను వివక్షత లేని పద్ధతిలో వివాహిత జంటలుగా గుర్తించడం సంబంధిత బాధ్యత అని సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్ నొక్కిచెప్పారు. ప్రజల అభీష్టం, ప్రజల సంకల్పం ఇప్పటికే రాజ్యాంగంలో ప్రతిబింబిస్తుందన్నారు.

ఢిల్లీ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (DCPCR) తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో స్వలింగ జంటలు దత్తత తీసుకోవడానికి అనుమతించబడుతున్నారని, పిల్లలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని చూపించడానికి వివిధ అధ్యయనాలను ఉదహరించారు. స్వలింగ జంటలకు గుర్తింపు ఇవ్వకపోవడం వివక్షను పెంచుతుందని
న్యాయవాది వృందా గ్రోవర్ వాదించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+