చదివేది ఎల్ఎల్ బి, బీసీఏ,పేలుడు పదార్థాలు ఎక్కడ కొన్నారంటే?, స్టూడెంట్స్ టార్గెట్!
భారతదేశంలో పుట్టిపెరుగుతు ఇక్కడే జీవిస్తున్న కొందరు యువకులు ఇదే దేశాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంతకాలం మన మధ్యనే వాళ్లు ఉన్నారని తెలుసుకుంటున్న సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. భారతదేశంలోనే నివాసం ఉంటున్న అనుమానిత ఉగ్రవాదులు, నిషేధిత సంస్థలు, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న వాళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తున్నా ఇలాంటి వారి సంఖ్య తగ్గడం లేదు.
డిసెంబరు 18వ తేదీన కర్ణాటకలోని బళ్లారి నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించి అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు బళ్లారిలోనే పేలుడు పదార్థాల తయారీకి అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసినట్లు కలకలం రేపే సమాచారం బయటకు రావడంతో బళ్లారి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎన్‌ఐఏ అధికారుల విచారణలో అరెస్టు అయిన ప్రధాన నిందితులు ఈ విషయం అంగీకరించారని తెలిసింది.

బళ్లారి అలో అరెస్టు అయిన ప్రధాన నిందితులు మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్, సయ్యద్ సమీర్‌లు పేలుడు పదార్థాల తయారీ కోసం అక్టోబర్ 22న నగరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి కిలో అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది. అయితే అరెస్టు అయిన నిందితులు అమ్మోనియం నైట్రేట్‌ను బళ్లారిలోని ఏ దుకాణం నుంచి కొనుగోలు చేశారనే దానిపై స్పష్టమైన క్లూ ఇవ్వలేదని అధికారులు అంటున్నారు.
అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు చేసిన రసీదు నిందితుల దగ్గర చిక్కలేదని, అమ్మోనియం నైట్రేట్ పొలం పంటలకు ఉపయోగించే యూరియా మాదిరిగానే ఉంటుందని, దాని అమ్మకంపై ఎటువంటి పరిమితులు, నియమాలు ఉండవు అని తెలిసింది. పేలుడు పదార్థాల తయారీకి కూడా ఈ పదార్థమే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 18వ తేదీన కర్ణాటక సహా దేశంలోని 19 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు విభాగం అధికారులు బళ్లారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.ఐఎస్ఐఎస్ స్ఫూర్తితో బళ్లారిని కేంద్రంగా (బళ్లారి మాడ్యూల్) ఎంచుకున్న ఉగ్రవాదులు దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసక చర్యలకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది.
అరెస్టు అయిన వారిలో ఒకరు న్యాయ విద్యార్థి (ఎల్ఎల్ బి) కాగా, మరొకరు బీసీఏ విద్యార్థి అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఐసిస్ సంస్థ వైపు విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు విచారణలో ఉంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications