కావేరి కోసం కర్ణాటకతో తమిళనాడు ఢీ, సుప్రీం కోర్టులో పిటిషన్, బెంగళూరులో!

చెన్నై/న్యూఢిల్లీ: కావేరి నీటి కోసం మరోసారి కర్ణాటక- తమిళనాడు ప్రభుత్వాల మధ్య వార్ మొదలైయ్యింది. కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీ సంప్రదింపుల సమావేశం ఈనెల 11వ తేదీన ఢిల్లీలో జరిగింది. కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఎస్.కె. హల్దార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన సీనియ్ అధికారులు పాల్గొన్నారు.

తమిళనాడు ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ కార్యదర్శి సందీప్ సక్సేనా, కావేరి టెక్నికల్ కమిటీ చైర్మన్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సమావేశంలో తమిళనాడు తరపున పాల్గొన్న అధికారులు తమిళనాడుకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే కర్ణాటక ప్రభుత్వ అధికారులు తమిళనాడుకు కావేరి నీరు వదిలిపెట్టడానికి నిరాకరించారు.

The Tamil Nadu government approached the Supreme Court to issue orders to release Cauvery water

దీంతో తమిళనాడుకు తగిన కావేరి నీటిని విడుదల చేయాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెకనుకు 10 వేల క్యూబిక్ అడుగుల చొప్పున 38 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సూచించింది. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం నీటిని తెరిచేందుకు నిరాకరించడంతో సమావేశంలో పాల్గొన్న తమిళనాడు అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

కావేరిలో సెకనుకు 24, 000 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేయాలని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరి నీటి విషయంలో తమిళనాడు,కర్ణాటక ప్రభుత్వాల మధ్య మరోసారి వార్ మొదలు కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో టెన్షన్ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+