రెండో దశ కరాళనృత్యం ఆగలేదు.!మూడో దశను ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉండాలంటున్నకేంద్రమంత్రి.!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కరోనా రెండో దశ విస్పోటనం ఆగకముందే మరో భయంకర వార్తను వినిపించారు కేంద్రమంత్రి. భారత దేశం మొత్తం కరోనా చేస్తున్న విలయ తాండవానికి గజగజ వణికిపోతున్న తరుణంలో మరో చేదు వార్త వినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా వ్యాక్సీన్ అందుబాటలోకి రాక దేశ వ్యాప్తంగా కరోనా బాదితులు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరోనా వైరస్ కు సంబందించి మరో ప్రమాదకర వార్తను కేంద్ర మంత్రి వినిపించారు.
అనేక రాష్ట్రాల్లోని అనేక ఆసుపత్రుల్లో ఆక్సీజన్, బెడ్లు, ఐసీయూ, వెంటిలేషన్ వసతులు లేని కారణంగా ఎంతో మంది కరోనా పేషెంట్లు పిట్టల్లా ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఇలాంటి తరుణంలో కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి ఓ కీలక ప్రకటన చేసారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది, జనం ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Recommended Video
భారత్‌లో కేవలం కరోనా సెకండ్ వేవ్‌ను మాత్రమే కాకుండా భవిష్యత్తులో మూడు, నాలుగు వేవ్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అందువల్ల ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు నితిన్ గడ్కరీ సూచించారు. దేశ ప్రజానీకమంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక ప్రజలు వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెమ్‌డెసివిర్‌కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా వార్ధాలో ముప్పై వేల డోస్‌ల ఉత్పత్తిని పెంచనున్నట్లు గడ్కరీ తెలిపారు.












Click it and Unblock the Notifications