Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కారణం..?

Ayodhya result 2024: మొన్నటి ఎన్నికల్లో యావత్ దేశానికి ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితం- అయోధ్య. అయోధ్య పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. అక్కడ సమాజ్‌వాది పార్టీ జెండా పాతింది. భారీ మెజారిటీతో ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని సొంతం చేసుకుంది.

అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం.. ఫైజాబాద్ లోక్‌సభ కిందికి వస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లల్లూ సింగ్ ఓడిపోయారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన అవధేష్ సింగ్.. 54 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఘన విజయం సాధించారు. అటు అయోధ్య పరిధిలో కూడా ఆయనకే మెజారిటీ ఓట్లు పోల్ అయ్యాయి.

The victory of Ayodhya is the democratic victory says SP Chief Akhilesh Yadav

ఈ రిజల్ట్ దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశమైంది. సాక్షాత్ శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రామమందిరాన్ని నిర్మించడం, అదే స్థాయిలో ఆ ఆలయాన్ని ప్రారంభించడం, బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం పట్ల విస్మయం వ్యక్తమైంది.

దీనిపై తాజాగా స్పందించారు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. లోక్‌సభలో దీనిపై మాట్లాడారు. అయోధ్యలో తమ అభ్యర్థి సాధించిన విజయం.. ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మతాన్ని జోడించడాన్ని అక్కడి ప్రజలు స్వాగతించలేదని చెప్పారు. మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. దేశ ప్రజల అవగాహన, చైతన్యం, ఓటర్ల మనోభావాలకు అయోధ్య ఫలితం ఓ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.

The victory of Ayodhya is the democratic victory says SP Chief Akhilesh Yadav

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని తాను ఎప్పటికి సమర్థించబోనని అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 లోక్‌సభ నియోజకవర్గాలన్నింట్లోనూ తాము గెలిచినా కూడా ఈవీఎంల వినియోగానికి మద్దతు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఈవీఎంల వివాదం అంశం ఎప్పటికీ జీవించే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. మెజారిటీ స్థానాలు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా వశం అయ్యాయి. 43 సీట్లు ఇండియాకు లభించగా.. బీజేపీకి దక్కినవి 36 మాత్రమే. 2019 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీకి బిగ్గెస్ట్ లాస్ మిగిలిందక్కడ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+