భారత్‌పై విషం చిమ్ముతున్న పాక్- ఆ వీడియోపై కేంద్రం క్లారిటీ
India Pakistan War: పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది.
భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అవుతోంది.

తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.
దీనితో పాటు జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై నేరుగా అటాక్ చేసింది భారత్. వాటన్నింటినీ ధ్వంసం చేసింది. నామరూపాల్లేకుండా నేలమట్టం చేసి పడేసింది. సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ పదే పదే మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగడం పట్ల ప్రతీకారాన్ని తీర్చుకుంది.
అదే సమయంలో- పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు భారత్‌పై విషం చిమ్ముతున్నాయి. దుష్ప్రచారానికి తెర తీశాయి. పాత వీడియోలను తవ్వి తీసి తాజాగా పోస్ట్ చేస్తోన్నాయి. భారత్‌లోని పలు కీలక ఆర్మీ పోస్టులను నిర్వీర్యం చేసినట్లు చెప్పుకొంటోన్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపై విధ్వంసక దాడిని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.
మొదట భారత ఆర్మీపై ఉగ్రవాదుల ఆత్మాహూతి దళాలు దాడులు చేశాయని, పెద్ద ఎత్తున నష్టం సంభవించిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు పోస్ట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో ఈ దాడి జరిగిందని, ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే ప్రచారం సాగింది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అవాస్తవమని తేల్చి చెప్పింది.
అదే సమయంలో గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పైనా పాకిస్తాన్ భయానక దాడి సాగించినట్లు కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఆ వీడియోలు నిజమే అయినప్పటికీ- ఇప్పటివి కావు. 2021 జులై 7వ తేదీన హజీరా పోర్ట్‌లో ఓ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియోలు అవి. వాటిని ఇప్పుడు సర్కులేట్ చేస్తోన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. దీన్ని నమ్మవద్దని కోరింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications