బీజేపీ vs బీజేపీ, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఏం జరిగింది ?, ఐటీ హబ్ లో ఇది పరిస్థితి, వైరల్ !
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నాయకులు చాలా బిజీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని నియోజక వర్గాల్లో టిక్కెట్లు రాని నాయకులు ప్రత్యర్థి పార్టీల నాయకులు రగిలిపోతున్నారు.
టిక్కెట్లు రాని నాయకులు కొందరు అయితే పరోక్షంగా చేతులు కలిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బెంగుళూరులోని దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఘటనతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కొందరితో వాగ్వివాదానికి దిగడంతో బీజేపీ కార్యకర్తలుషాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అంతే కాకుండా ఖాతాదారులపైనా, ఎన్నికల అధికారులపైనా ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో బీజేపీ నాయకులు హడలిపోయారు. మొదట ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యల అనుచరుల మద్య వాగ్వివాదం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో తమకు ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చెయ్యలేదని స్థానిక పోలీసులు తెలిపారని కన్నడ మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications