అంగన్ వాడి టీచర్ ఏం చేసిందంటే ?, గ్రామస్తుల ఫిర్యాదు, తహసిల్దార్ ముందే ఆత్మహత్యాయత్నం !
అంగన్ వాడి టీచర్ గా పని చేస్తున్న మహిళ ఆ ప్రాంతంలోని ప్రజలు అందరితో పరిచయాలు పెంచుకుంది. ఆ గ్రామంలోని ప్రజలు అందరూ అంగన్ వాడి టీచర్ ను గౌరవించారు అయితే గ్రామస్తులు అందరూ అంగన్ వాడి టీచర్ మీద తిరగబడ్డారు. పోలీసులు, తహసిల్దార్ తో పాటు అధికారుల ముందు పంచాయితీ జరిగింది. పంచాయితీ జరుగుతున్న సమయంలోనే అంగన్ వాడి టీచర్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని బసవనబాగేవాడి తాలుకాలోని ఉప్పలదిన్ని తాండాలో వేలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామంలో విజయలక్ష్మి అశోక్ కుమార్ అలియాస్ విజయలక్ష్మి అనే మహిళ అంగన్ వాడి టీచర్ గా పని చేస్తోంది. పక్కఊరిలో నివాసం ఉంటున్న అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి ప్రతిరోజు ఉప్పలదిన్ని తాండాలో విధులకు వెళ్లి వస్తోంది.

గ్రామంలోని అందరూ అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మికి పరిచయం ఉన్నారు. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో నివాసం ఉంటున్న కొందరు ఒక్కకొక్కరిగా మతం మారిపోతున్నారని తెలిసింది. ప్రజలు ఎందుకు మతం మారుతున్నారు అంటూ తాండాలోని గ్రామ పెద్దలు ఆరా తీశారు. అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి ఒత్తిడి కారణంగా గ్రామంలోని ప్రజలు మతం మారుతున్నారని వెలుగు చూడటంతో గ్రామ పెద్దలు హడలిపోయారని తెలిసింది.
అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి గ్రామంలోని హిందువులను మతం మారుస్తున్నారని, ఆమె అంగన్ వాడి టీచర్ గా మా గ్రామంలో పని చెయ్యడానికి మేము అంగీకరించమని, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. తహసిల్దార్, పోలీసులు కలిసి గ్రామానికి వెళ్లి పంచాయితీ పెట్టారు. ఇదే పంచాయితీకి అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి హాజరైయ్యింది.

పంచాయితీ జరుగుతున్న సమయంలోనే ఎక్కువ మంది గ్రామస్తులు మాట్లాడుతూ అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి బలవంతంగా మాతో మతమార్పిడి చేయించడానికి ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు అయితే గ్రామస్తులు వాళ్ల ఇష్టప్రకారం మతం మారుతున్నారని, తాను ఎవరితో బలవంతంగా మతమార్పిడి చేయించలేదని విజయలక్ష్మి తహసిల్దార్ సమక్షంలో చెప్పారు. ఆ సందర్బంలో గ్రామస్తులకు, అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మిల మద్య మాటల యుద్దం జరిగింది.
ఆ సమయంలో సహనం కోల్పోయిన విజయలక్ష్మి తన మీద చర్యలు తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి మీద తహసిల్దార్, పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్దం కావడంతో విజయలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అంగన్ వాడి టీచర్ ఇచ్చిన మరో ఫిర్యాదు ఆధారంగా గ్రామంలోని కొందరి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications