ప్రభుత్వ ఉద్యోగం, ఇంజనీరు కొంప ముంచిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, కోట్లలో, భార్య ఏం చేసిందంటే ?
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు సంతోషంగా పెళ్లి చేసుకుని కొంతకాలం భార్యతో హ్యాపీగా ఉన్నాడు. తరువాత అసలు కథ మొదలైయ్యింది. దర్శన్ బాబు అనే ఒక ఇంజనీరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ లకు అలవాటు పడటంతో అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి అంటే ఆ ఇంజనీరు భార్య గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి.
అయితే ఎంత జరిగినా భర్త మారకపోవడంతో అతని భార్య ఆమె భర్త మీద, జీవితంపై విరక్తి పెంచుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇంజనీరు ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగుల వ్యసనానికి బానిస కావడంతో అతని భార్య ఎవ్వరూ ఊహించని నిర్ణయంతీసుకుంది. ప్రభుత్వ శాఖలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న దర్శన్ బాబు అలియాస్ దర్శన్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కట్టడానికి అలవాటుపడ్డాడు. 2021 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గేమ్‌లపై ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు బెట్టింగ్ లు వేశాడు.

భర్త దర్శన్ తీరుతో విసిగిపోయిన అతని భార్య రంజిత (23 ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఇంట్లో రంజిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. రంజిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆమె భర్త దర్శన్ ఇప్పటికే రూ కొన్ని కోట్ల రూపాయాలు అప్పులు చేశాడు. హోసదుర్గలోని చిన్ననీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దర్శన్ కు విపరీతంగా ఐపీఎల్ బెట్టింగ్ లు కట్టే అలవాటు ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
2021 నుండి 2023 వరకు ఐపీఎల్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకున్న దర్శన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యాడని వెలుగు చూసింది. అదృష్టం లేకపోవడంతో బెట్టింగ్ లు కట్టిన ప్రతిసారి దర్శనం ఓడిపోతున్నాడని, తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లించడానికి మరికొందరి దగ్గర అప్పులు చెయ్యడం మొదలుపెట్టాడని, ఇప్పటికే ఆస్తులు అమ్మి రూ. 1. 50 కోట్ల వరకు అప్పులు తీర్చాడని, ఇంకా అతనికి రూ. 84 లక్షలు అప్పులు ఉన్నాయని రంజిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమచాారం ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దర్శన్ ను 2020లో రంజిత వివాహం చేసుకుందని, భర్త దర్శన్ ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న నిజాన్ని 2021లో రంజిత గ్రహించిందని ఆమె తండ్రి వెంకటేష్ చెప్పాడని పోలీసులు అన్నారు.వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు రంజిత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా రంజిత డెత్ నోట్ లో రాసిందని, ఆ వడ్డీ వ్యాపారులు తన అల్లుడు దర్శన్ ఆస్తులను ఎరగా వేసి అతని ఎంత కావాలంటే అంత డబ్బులు అప్పులు ఇచ్చి అతను ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడేలా చేశారని రంజిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంజిత్ రాసిన డెత్ నోట్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని కర్ణాటక పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దర్శన్ అతని భార్యతో సంతోషంగా ఉండకుండా ఐపీఎల్ బెట్టింగ్ ల మోజులో పడి అతని భార్య రంజిత ఆత్మహత్యకు కారణం కావడం కలకలం రేపింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications