భర్తను ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేశారు, భార్య జంప్ అయిపోయింది !

చెన్నై/చెంగల్పట్టు: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పిల్లలు పుట్టారు. దంపతులు వారి పిల్లలు అందరికి వివాహాలు చేశారు. దంపతులు వేరే ఇంటిలో కాపురం ఉంటున్నారు. ఇదే సమయంలో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వెళ్లి చూడగా భర్తను ముక్కలు ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ డ్రమ్ లో వేసిన విషయం వెలుగు చూసింది. అయితే భార్య మాయం కావడంతో పలు అనుమానాలకు దారితీసింది.

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్ పక్కనే ఉన్న అలదూర్ గ్రామంలో రాజేశ్వరి అనే మహిళకు చెందిన చాలా ఇండ్లు ఉన్నాయి. ఈ ఇళ్లను ఆమె అద్దెకు ఇచ్చింది. అలటూరు సిట్‌కో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు రాజేశ్వరికి చెందిన ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారు. ఈ ఇంట్లో వలతి కోవిలన్ (76), అతని భార్య ఎజిలరసి (54) గత 4 సంవత్సరాలుగా అద్దెకు నివసిస్తున్నారు.

deadbody

కోవిలన్, ఎజిలరసి వయసులో ఏకంగా 22 ఏళ్ల తేడా ఉంది. కోవిలన్, ఎజిలరసి దంపతుల పిల్లలకు ఇప్పటికే పెళ్లిళ్లు జరిగిపోవడంతో ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి యజమాని రాజేశ్వరి శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోవిలన్ అద్దె చెల్లించకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లింది. అప్పుడు ఇంటికి తాళం వేసి ఉంది. అలాగే ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని ఇంటి యజమాని రాజేశ్వరి గుర్తించింది. దీంతో అనుమానం రావడంతో ఇంటి యజమాని రాజేశ్వరి తిరుపోరూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న డీఎస్పీ జగతీశ్వరన్, తిరుపోరూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశన్, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో ఓ ప్లాస్టిక్ డ్రమ్మును నల్లటి ప్లాస్టిక్ కవర్ తో కప్పారని గుర్తించారు. దుర్వాసన రావడం, డ్రమ్ రక్తం ఉండటంతో పోలీసులు హడలిపోయారు. డ్రమ్ లోపల పరిశీలిస్తే,ఒక మగ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాని మీద కవర్ కప్పిన విషయం వెలుగు చూసింది.

police4

కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఇరుగుపొరుగు వారిని, ఇంటి యజమాని రాజేశ్వరిని విచారించగా ఆ ఇంట్లో ఉండే వలతి కోవిలన్ అని తేలింది. అనంతరం అలటూరు గ్రామ పరిపాలనా అధికారి ధరణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకు గురైన వలతి కోవిలన్, అతని భార్య ఎజిలరసి విల్లుపురం జిల్లాకు చెందిన వారని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వలతి కోవిలన్‌ను ఎవరు చంపారు, అతని భార్య ఎజిలరసి ఎక్కడ ఉన్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+