రీల్స్ చెయ్యకూడదని చెప్పిన భర్తను చంపేసిన భార్య, సోషల్ మీడియాలో రచ్చరచ్చ !
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్న భార్యను అలా రీల్స్ చేయవద్దని భర్త చెప్పాడు. భర్త చెప్పిన బుద్దిమాటలకు భార్యకు చాలా కోపం వచ్చింది. అంతే భార్య ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భర్తను హత్య చేసిన తరువాత ఆ భార్య ఆ తప్పును కప్పిపుచ్చడానికి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు, ఊరివాళ్లను నమ్మించడానికి ప్రయత్నించింది.
భర్తను హత్య చేసిన కిలాడీ లేడి అతని శవానికి ఉరి వేసిన ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య చేస్తున్న రీల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి భర్తను హతమార్చింది. మహేశ్వర్ రాయ్ (25)అనే వ్యక్తిని అతని భార్య రాణి, ఆమె బంధువులు గొంతు నులిమి చంపేశారని బీహార్ పోలీసు అధికారులు తెలిపారు.

మహేశ్వర్ రాయ్ ని హత్య చేసిన తరువాత ఫఫౌట్ గ్రామంలోని ఖోడాబంద్‌పూర్‌లోని తన కుమారుడి అత్తగారి ఇంట్లో అతనికి ఉరి వేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని మహేశ్వర్ రాయ్ తండ్రి రామ్ రాయ్ ఫిర్యాదు చేశాడని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. రాణిని ఇప్పటికే అరెస్టు చేశామని, అయితే ఆమె బంధువులు పరారీలో ఉన్నారని ఎస్‌హెచ్‌ఓ మిథిలేష్ కుమార్ తెలిపారు.
మహేశ్వర్ కు, సమస్తిపూర్ జిల్లా నివాసి మరియు కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న రాణి అనే యువతికి ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. రాణికి సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. అంతేకాకుండా తాను చేస్తున్న రీల్స్ ద్వారా డబ్బులు సంపాధించాలనే ఆశకూడా ఉందని, అందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీళ్లు, ఆమె ఇతర ఆలోచనలను పోస్ట్ చేసేదని మహేశ్వర్ రాయ్ తండ్రి రామ్ రాయ్ పోలీసులకు చెప్పాడు.

రాణి రీల్స్ చెయ్యడంతో అందుకు నా కొడుకు మహేశ్వర్ రాయ్ అభ్యంతరం చెప్పాడని, కానీ రాణి మాత్రం రీళ్లు చేస్తూనే ఉందని రామ్ రాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నా పెద్ద కొడుకు రుడాల్ గత ఆదివారం నా రెండో కొడుకు మహేశ్వర్‌కు ఫోన్ చేసాడని, అయితే అతని ఫోన్ కాల్ మరొకరు తీశారని, నాకు అనుమానం వచ్చి నా కోడలు రాణి ఇంటికి వెళ్ళానని, ఆ సమయంలో నా కొడుకు మహేశ్వర్ రాయ్ శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తామనే సాకుతో కొందరు యువకులు మహేశ్వర్ మృతదేహాన్ని మరోచోటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, తనకు అనుమానం వచ్చి గొడవ చేస్తే నిందితులు పారిపోయారని రామ్ రాయ్ పోలీసులకు సమాచారం అందించారు. భర్తను హత్య చేసిన కిలాడీ లేడీ రాణిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications