భర్త ఏం అడిగాడు ?, భార్య ఎక్కడ పొడిచింది, దంపతుల మధ్య అదే గొడవ, చివరికి !
దంపతులు ఎంత సంతోషంగా ఉంటే వారి బంధం అంత బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. భర్తకు టీ తాగాలి అనుకున్నాడు. వెంటనే అతని భార్య వద్దకు వెళ్లి కేవలం టీ అడిగాడు. తరువాత అక్కడ సీన్ మారిపోయింది. అయితే భార్య కోపంతో అతని కళ్ళలో కత్తెరతో పొడిచింది. అంతే భర్తను రక్తపుమడుగులో వదిలేసి భార్య ఇంటి నుంచి పారిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని దంపతుల మధ్య వివాహేతర సంబంధానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని సమాచారం.దాడికి గురైన వ్యక్తి పేరు అంకిత్ అని పోలీసులు తెలిపారు. అంకిత్ మూడేళ్ల క్రితమే నిందితురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే అంకిత్ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య చాలా సమస్యలు ఉండేవి. ప్రతిరోజు అంకిత్ దంపతుల గొడవపడుతున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం సంఘటన జరిగిన మూడు రోజుల ముందు తన భార్య, ఆమె తల్లి కలిసి తనను శారీరక వేధింపులకు గురి చేశారని అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్ కప్పు టీ అడగడంతో అతడి భార్యకు కోపం వచ్చింది. ఆపై నిందితురాలు అంకిత్ మీద దాడి చేసింది. అంతటితో కోపం తగ్గకపోవడంతో భార్య ఆమె భర్త అంకిత్ కంటిలో కత్తెరతో పొడిచేసిందని పోలీసులు తెలిపారు.
ఇంటి లోపల నుంచి అరుపులు వినిపించడంతో అంకిత్ బంధువులు అక్కడికి వెళ్లారు. వెంటనే బాధితుడు అంకిత్ ను ఆసుపత్రికి తరలించి తరువాత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. అంకిత్ కు మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. తరువాత అంకిత్ ను మీరట్ లోని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. పోలీసులు వెళ్లేలోపే అకింత్ భార్య ఇంటి నుంచి పారిపోయింది. నిందితురాలి ఆచూకీ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications