కోడలి మీద కన్ను వేసిన మామ, టార్చర్ తట్టుకోలేక పక్కాప్లాన్ తో భర్తను చంపిన భార్య !
బెంగళూరు/రామబరేలి: వివాహం చేసుకున్న దంపతులకు సంతోషంగా కాపురం చెయ్యడంతో నలుగురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో ఆ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడికి పెళ్లి అయ్యింది. కొడుకు భార్య మీద కన్ను వేసిన మామ ఆమెను తన పక్కలో పడుకోవాలని టార్చర్ పెట్టాడు. తరువాత తన భర్త కోడలి మీద కన్ను పడిందని తెలుసుకున్న భార్య రగిలిపోయింది.
తన 19 ఏళ్ల కోడలును లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య ఆమె భర్త గొంతు కోసి హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి సమీపంలోని బిల్సీ పట్టణంలోని తన ఇంటి పెరట్లో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ (43) వ్యక్తి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనాడు. గుర్తు తెలియని వ్యక్తులు తేజేంద్ర సింగ్ ను హత్య చేసినట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.

అయితే పోలీసుల విచారణలో తేజేంద్ర సింగ్ భార్య మిథ్లేష్ దేవి పదేపదే ఆమె స్టేట్‌మెంట్‌లను మారుస్తూనే ఉందని, తరువాత ఆమె మీద తమకు అనుమానం వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి బ్రజేష్ సింగ్ మీడియాకు చెప్పారు. ఈ విషయమై దేవిని విచారించగా తన భర్త తేజేంద్ర సింగ్ ను తానే హత్య చేశానని మిత్లేష్ దేవి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.
నలుగురు పిల్లల తల్లి అయిన మిథ్లేష్ దేవి తన భర్త తరచూ తనను కొట్టేవాడని, కోడలు తనతో పడుకునేలా ఒప్పించమని తనను బలవంతం చేసేవాడని, తన కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసేవాడని పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో నేను నా భర్త తేజేంద్ర సింగ్ ను హత్య చేయడానికి అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూశానని, రాత్రి నా భర్త మద్యం మత్తులో ఇంటి తిరిగి వచ్చి ఇంటి బయట నిద్రపోయాడని, తరువాత నేను కొడవలితో అతని గొంతు కోసి చంపేశానని, నా కోడలిని రక్షించడానికి నేను అలా చేసాను అని దేవి నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications