మాజీ సీఎంపై పోక్సో కేసు పెట్టిన మహిళ మృతి, కూతురి కోసం?, ఏం జరిగిందంటే!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన ఓ మహిళ మృతి చెందింది. ఈ ఫిర్యాదు మేరకు మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోంది. యడ్యూరప్ప తన 17 ఏళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా ఇదే ఏడాది మార్చి 14వ తేదీన యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం యడ్యూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బీజేపీ నాయకులతో పాటు కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు ఈ కేసును సీఐడీకి అప్పగించింది. మే 26వ తేదీన ఆదివారం బెంగళూరులోని హులిమావు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాజీ సీఎం యడియూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ మరణించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అందక 53 ఏళ్ల మహిళ మృతి చెందిందని అధికారులు తెలిపారు. పోలీసు శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోంది. మహిళకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఇది తప్పా ఆమె కుటుంబ సమాచారం అందుబాటులోలేదని పోలీసు అధికారులు తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
తమకు సహాయం చెయ్యాలని కోరేందుకు వెళ్ళినప్పుడు డాలర్స్ కాలనీలోని నివాసంలో తన 17 ఏళ్ల తన కుమార్తెపై మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా మార్చి 14వ తేదీన రాత్రి మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మార్చి 15వ తేదీన కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మహిళ, బాధిత బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బీ ఎస్. యడ్యూరప్ప కూడా సీఐడీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించేందుకు వాయిస్ శాంపిల్ ఇచ్చారు. ఇదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన తన డాలర్స్ కాలనీ నివాసానికి వచ్చినప్పుడు యడ్యూరప్ప తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ కేసు చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదుపై బీఎస్. యడ్యూరప్ప స్పందిస్తూ ఇది అన్యాయం. మాకు న్యాయం చేయాలని తల్లీ, కూతురు చాలాసార్లు నా వద్దకు వచ్చారని, వారిని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వద్దకు పంపించానని, అప్పుడు వారు నాపై ఏదో ఆరోపణలు చేశారని యడియూరప్ప అన్నారు. మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పపై కేసును దర్యాప్తు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications