చైన్ స్నాచింగ్ కేసుల్లో కన్నడ సినీ నిర్మాత అరెస్టు, పోలీస్ స్టేషన్ నుంచి పరార్, ఆంధ్రాలో మకాం !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో పైకి సినీ నిర్మాతగా తిరుగుతూ వరుసగా చైన్ స్నాచింగ్ లు చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఇక్కడి బసవేశ్వరనగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రతప్ రంగు అలియాస్ రంగ అనే సినీ నిర్మాతను పోలీసులు అరెస్ట చేసి విచారణ చేస్తున్నారు.

ప్రతాప్ రంగు అలియాస్ రంగ 'డబుల్ మీనింగ్ 'అనే కన్నడ సినిమాను నిర్మించాడు. ఇతను బైక్ లో బెంగళూరు నగరంలో సంచరిస్తూ ఒంటరిగా వెలుతున్న మహిళల మెడలో వరుసగా బంగారు గొలుసులు లాక్కొని పరారౌతున్నాడు. బెంగళూరు నగరంలోని బసవేశ్వర నగర, మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్లలో ప్రతాప్ రంగు మీద అనేక కేసులు నమోదు అయ్యాయి.

Theft Case Sandalwood Film Producer arrested in Bengaluru in Karnataka.

15 రోజుల క్రితం పోలీసులు ప్రతాప్ రంగు చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతాప్ రంగు తనతెలితేటలు ఉపయోగించి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో తలదాచుకున్నాడు.

శనివారం బెంగళూరు వచ్చిన ప్రతాప్ రంగు విదాన సౌధ సమీపంలోని ఎంఎస్ బిల్డింగ్ దగ్గర సంచరిస్తున్న సమయంలో పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. ప్రతాప్ రంగు అలియాస్ రంగ మీద అనేక చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని, విచారణ చేస్తున్నామని బసవేశ్వరనగర పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Theft Case Sandalwood Film Producer arrested in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి