Maharashtra Assembly election 2024: ఆదిత్య థాకరేపై పోటీకి సిద్ధమైన మిలింద్ దేవరా..!
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం క్రమంగా వేగం పుంజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ను నుంచి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరిన మిలింద్ దేవరా శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరేపై పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ముంబైలోని వర్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదిత్య థాకరే వర్లీ నుంచి 2019లో గెలిచారు. వర్లీ నుంచి మళ్లీ బరిలోకి దిగిన ఆదిత్య థాకరేపై అభ్యర్థిని ఖరారు చేసేందుకు శివసేన ప్రస్తుతం చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.
జనవరిలో శివసేనలో చేరిన దేవరా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో వర్లీ బాధ్యతలు అప్పగించారు. షిండే నేతృత్వంలోని పార్టీ దేవరా వర్లీలో పట్టు సాధించగలదని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మధ్యతరగతి మరాఠీలు, మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. ఇటు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) వర్లీ నుంచి సందీప్ దేశ్‌పాండేని పోటీకి దింపింది. ఆదిత్య ఠాక్రేపై పోటీ చేసే అభ్యర్థుల రేసులో దేవరాతో పాటు మరాఠీ నటుడు సుశాంత్ షెలార్, బీజేపీ అధికార ప్రతినిధి షైన ఎన్‌సీ ఉన్నారు.

బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా ఉన్నాయి. మహా వికాస్ అఘాడి (MVA)లో కాంగ్రెస్, శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని NCP ఉంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 22 నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న నామినేషన్ల స్క్రూటీ చేయనున్నారు. నామినేషన్ విత్ డ్రాకు నవంబర్ 4 తేదీ వరకు గడువు ఉంది. నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు.
నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications