కర్ణాటక బంద్, భారీ బందోబస్తు, రంగంలోకి కేఎస్ఆర్ పీ, సీఆర్ పీ, ఆస్తులతో గేమ్స్ ఆడితే !
బెంగళూరు: కావేరి (cauvery) జలాల కోసం కన్నడిగుల కోసం చేస్తున్న పోరాటం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కావేరీ నీటి కోసం రేపు సెప్టెంబర్ 29వ తేదీ శుక్రవారం కర్ణాటక బంద్‌కు (Karnataka Bandh) పిలుపునిచ్చారు. ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బెంగళూరు (Bengaluru) నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద్ కొన్ని కఠిన ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు జారీ చేసిన నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దయానంద్ హెచ్చరించారు.
ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు బెంగళూరు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, దీంతో పాటు బంద్ (Karnataka Bandh) సందర్భంగా ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని, నిరసనల సందర్భంగా ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లితే ఆ నష్టానికి నిరసనకు పిలుపునిచ్చిన వారిదే బాధ్యత వహించాలని బెంగళూరు (Bengaluru) నగర పోలీసు కమీషనర్ దయానంద్ హెచ్చరించారు.

ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయించిన (Karnataka Bandh) తరువాత ఇతర వాహనాలను రోడ్డుపై అడ్డగించినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని (Bengaluru) దయానంద్ హెచ్చరించారు. పౌరులకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయనున్నట్లు (Bengaluru) దయానంద్ తెలిపారు.
కర్ణాటక బంద్ (Karnataka Bandh) సందర్భంగా భద్రత నిమిత్తం కేఎస్‌ఆర్‌పీ, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. హోంగార్డులను ఇంకా మోహరించారు. కర్ణాటక బంద్ (Karnataka Bandh) సందర్భంగా ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదు. బెంగళూరు (Bengaluru) నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆందోళనకు అనుమతించినట్లు నిరసనకారులు తెలిపారు.

ఇటీవల (మంగళవారం) బెంగళూరు బంద్ (Karnataka Bandh) సందర్భంగా జయనగర్‌లోని పలు హోటళ్లపై దాడి, రాళ్లదాడి ఘటనలపై బెంగళూరు నగర (Bengaluru) పోలీసు కమీషనర్ మాట్లాడుతూ రాళ్లు రువ్విన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు విధ్వంసకారులను అరెస్ట్ చేశామని, ఇంకా సీసీటీవీలను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications