Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

bomb: ఆ విమానంలో బాంబు ఉంది, రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానం ఉజ్జకిస్తాన్ లో ల్యాండింగ్ !

గోవా/న్యూఢిల్లీ: విమానాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారం అయిపోయింది. ఉత్తుత్తి బాంబు బెదిరింపులు చేస్తున్న వారిని గుర్తిస్తున్న పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. బాంబు బెదిరింపుల కేసుల్లో చాలా మంది జైలుకు వెళ్లినా ఇంకా ఇలాంటి బాంబు బెదిరింపుల ఫోన్లు, ఈమెయిల్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

రష్యా నుంచి గోవాకు వస్తున్న చార్టెడ్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హడలిపోయారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హడలిపోయారు. అధికారుల హెచ్చరికతో రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు దారిమళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు.

There was a bomb threat on the plane coming from Russia to Goa. The officials made an emergency landing of the plane in Uzbekistan.

అధికారుల సమాచారం ప్రకారం రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గోవాకు వస్తున్న అజుర్ ఎయిర్ చార్టర్డ్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న గోవా అధికారులు సంబంధిత వర్గాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు ఆ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌ లో అత్యవసరంగా ల్యాండిగ్ చెయ్యడానికి చర్యలు తీసుకున్నారు.

There was a bomb threat on the plane coming from Russia to Goa. The officials made an emergency landing of the plane in Uzbekistan.
రష్యా నుంచి గోవా బయలుదేరిరన విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే విమాన సంస్థకు చెందిన విమానంలో బాంబు ఉందని బెదిరించారు. ఆ సందర్బంలో గుజరాత్ లోని జామ్ నగర్ కు ా విమానం మల్లించి అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. ఆ విమానంలో కూడా 236 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారు.
There was a bomb threat on the plane coming from Russia to Goa. The officials made an emergency landing of the plane in Uzbekistan.

మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానంలో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో జామ్ నగర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తరువాత విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి బాంబు చిక్కలేదు. మరుసటి రోజు ఆ విమానం టేకాఫ్ కావడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారని తెలిసంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+