పోటీ రాజకీయ పార్టీల మధ్య కాదు.. కుటుంబ సభ్యుల మధ్యే..!

దేశంలో మరో ఎన్నిక నగరా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న పోలింగ్ , నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు మెజార్టీ కావాల్సి ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో మొత్తం కూడా సింగిల్-ఫేజ్‌లోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలోని ఓటర్లలో 4.97 కోట్ల మంది పురుషులు మరియు 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 9.63 కోట్ల ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దాదాపు 21 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

దీంతో ఈసారి మహారాష్ట్రలో ఏ పార్టీ విజయం సాధించాలనేది కొత్త ఓటర్ల చేతిలో ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి అండగా నిలవలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ , కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ థాకరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే ,ఎన్‌సీపీ అజిత్‌ పవార్‌..ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది.

these elections will affect the political future of Maharashtra

బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈసారి జరగబోయే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏక్‌నాథ్‌ షిండే సీఎం కూర్చీతో పాటు శివసేన పార్టీ గుర్తును సైతం చేజిక్కించుకోవడంతో ఉద్ధవ్ థాకరేకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎటువంటి గుర్తు లేకపోయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ ఉద్ధవ్ థాకరే యొక్క సేన (UBT) ముంబైలో గణనీయమైన విజయాన్ని సాధించింది. పార్టీ పేరు, గుర్తును కోల్పోయినప్పటికీ, బాల్ థాకరే వారసత్వానికి అతని వాదనను బలపరిచి, నాలుగు స్థానాలకు మూడు స్థానాలను గెలుచుకుంది. ఇక అన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన అజిత్‌ పవార్‌ దీనికి భిన్నంగా ఏమీ కనిపించడం లేదు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే జాతీయ పార్టీలైనా బీజేపీ , కాంగ్రెస్ పార్టీలను ఇక్కడ సైడ్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి జరిగే ఎన్నికలు పార్టీల మధ్య కాదు, వ్యక్తుల మధ్యే అనేది స్పష్టం అవుతోంది. శరద్ పవార్‌ నమ్మించి మోసం చేసిన ఆయన తమ్ముడు అజిత్‌ పవార్‌, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చడంతో పాటు, పార్టీ గుర్తు లాగేసుకున్న ఏక్‌నాథ్‌ షిండే వీరిద్దరు ఓవైపు ఉండగా, శరద్ పవార్‌ ,ఉద్ధవ్ థాకరే మరో వైపు ఉన్నారు. ఈ రెండు వర్గాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేరో వైపు మద్దతిస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జరగనున్న ఈ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో , దాని పాలనను ఎలా పునర్నిర్మిస్తాయో చూడటానికి దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఈ ఎన్నికల్లో అయిన మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజార్టీని కట్టబెడతారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+