వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్ కొట్టారు: ఈ పనిమనుషులు డ్రైవర్లకు ముందే దీపావళి వచ్చేసింది

|
Google Oneindia TeluguNews

క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ కంపెనీ యజమాని వైద్యనాథన్ వెంబు ఇంట్లో పనిచేసే ముగ్గురు పనిమనిషులకు, ఇద్దరు డ్రైవర్లకు ముందే దీపావళి వచ్చేసింది. వీరితో పాటు ఆయన సహోద్యోగులు, కుటుంబసభ్యులకు కూడా దీపావళి పండగా ఇంకా నాలుగు రోజులు ఉండగానే వచ్చేసింది. ఎందుకో తెలుసా..? అయితే ఇది చదవండి.

బహుమతిగా రూ.20 కోట్లు విలువ చేసే షేర్లు ఇచ్చిన వైద్యనాథన్

బహుమతిగా రూ.20 కోట్లు విలువ చేసే షేర్లు ఇచ్చిన వైద్యనాథన్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ సంస్థ యజమాని వైద్యనాథన్ వెంబు ఇంట్లో దీపావళి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఇతని ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు , పనిమనుషులకు ఇతని సహోద్యోగులకు, కుటుంబ సభ్యులకు తన సంస్థ నుంచి రూ. 20 కోట్లు విలువ చేసే 4 లక్షల 30వేల షేర్లు బహుమతిగా ఇచ్చారు. దీంతో వారు ఎగిరి గంతేయడమే కాదు తమకు ముందుగానే దీపావళి పండగ వచ్చేసిందని సంబరపడుతున్నారు.

ఎవరికి ఎన్ని షేర్లు ఇచ్చారో తెలుసా..?

ఎవరికి ఎన్ని షేర్లు ఇచ్చారో తెలుసా..?

ముగ్గురు పనిమనుషులకు, ఇద్దరి డ్రైవర్లకు ఒక్కొక్కరికి 6,500 షేర్లు ఇచ్చారు. ఇక 26 మంది సహోద్యోగులకు ఒక్కొక్కరికి 11వేల షేర్లు ఇచ్చారు. తన సోదరుడు సత్యమూర్తి వెంబుకు 26వేల షేర్లు, మరో సోదరుడు కృష్ణమూర్తి వెంబుకు 13వే షేర్లు కానుకగా ఇచ్చారు. ఇదంతా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ వివరించింది. మరో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు అందరికీ కలిపి 71,500 షేర్లు ఇచ్చారు వైద్యనాథన్ వెంబు.

2010లో చిన్న స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్

2010లో చిన్న స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్

ఇక శుక్రవారం కంపెనీ షేర్ విలువ రూ.478.60 వద్ద ముగిసింది. దీంతో మొత్తం 11వేల షేర్ విలువ రూ. 52.64లక్షలు అయ్యింది. ఇక డ్రైవర్లు, పనిమనుషులకు వైద్యనాథన్ ఇచ్చిన షేరు విలువ రూ.31.1 లక్షలు. అంటే ఒక్కొక్కరికి ఇంత పెద్ద మొత్తం కానుకగా ఇచ్చారు వైద్యనాథన్. కంపెనీలో వైద్యనాథన్ వాటా 4.04 మిలియన్ షేర్లు. 2010లో ఒక చిన్న స్టార్ట్ అప్‌గా ప్రారంభమైన తన కంపెనీను నమ్ముకొని అప్పటికే పెద్దస్థాయిలో జీతాలు తీసుకుంటున్న వారు తమ కంపెనీలో చేరి ఈ నాడు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషిచేశారని వైద్యానాథన్ తెలిపారు. ప్రస్తుతం తన కంపెనీ ఓ బ్యాంకుతో విలీనం కానుందని దీనికి కారణం తమ కంపెనీ దాదాపు బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంపైనే పనిచేస్తుందని చెప్పారు. మరో కంపెనీలోకి వెళ్లే ముందు క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్‌ను ఉన్నతస్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ వైద్యనాథన్ కృతజ్ఞతలు తెలిపారు.

షేర్లు అన్నీ ప్రేమతోనే చాలా ఇష్టంగా ఇచ్చారు

షేర్లు అన్నీ ప్రేమతోనే చాలా ఇష్టంగా ఇచ్చారు

"క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ ఈ స్థాయికి చేరుకోవడంలో వైద్యనాథన్ కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేయడమే కాకుండా సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఇది ఒక మంచి అవకాశంగా భావించారు. ఇందులో భాగంగానే తన వెంటే ఉన్న తనవారికి వైద్యనాథన్ వ్యక్తిగత వాటా నుంచి షేర్లు బదిలీ చేశారు. ఇందులో తన వారసులకు ఎలాంటి వాటాలు ఇవ్వలేదు. ఈ వాటాలు పూర్తిగా ప్రేమతో , ఇష్టంతో వైద్యనాథన్ ఇచ్చారు తప్పితే దీని వెనక ఎలాంటి టాక్స్ ప్లానింగులు లేవు " అని కంపెనీ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

English summary
Diwali has come early for two drivers, three maids, some colleagues and family members of Vaidyanathan Vembu, the promoter and chairman of Capital First Ltd. He has gifted nearly 430,000 shares worth over ₹20 crore to these people.While Vaidyanathan is giving away 6,500 shares each to the maids and drivers, 26 former and present colleagues will get 11,000 shares each. Satyamurthy Vembu, a brother, gets 26,000 shares. Another brother, Krishnamurthy Vembu, gets 13,000 shares, the company said in a stock exchange filing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X