వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆస్తులను జాతీయం చేయలేం..: మద్రాస్ హైకోర్టు

జయలలిత ఆస్తులన్ని ఆమె స్వయంగా సంపాదించుకున్నవే కాబట్టి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

మధురై: తమిళ దివంగత సీఎం జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

గురువారం నాడు ఈ పిటిషన్ విచారణకు రాగా మద్రాస్ హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. జయలలిత ఆస్తులన్ని ఆమె స్వయంగా సంపాదించుకున్నవే కాబట్టి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్‌ సెల్వం, జస్టిస్‌ కలైరసన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ని తిరస్కరించింది.

These were self earned by her : HC rejects PIL for nationalisation of Jaya's assets

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం.. ఈ కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకు రాదని కోర్టు వెల్లడించింది. సొంత ఆస్తులను జాతీయం చేయాలని ఆదేశాలు జారీ చేసే హక్కు కోర్టుకు లేదని పేర్కొంది.

కాగా, జయలలితకు వారుసులెవరూ లేని కారణంగా ఆమె ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ స్వచ్చంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో ఈ వ్యవహారం అంతా నడిపించాలని పిటిషన్ లో కోరారు. ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని
ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాల్సిందిగా చూడాలని పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

English summary
Madras High Court on Thursday dismissed a PIL seeking a direction to the Centre to nationalise the immovable and movable properties of late Tamil Nadu chief Minister J Jayalalithaa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X