సినిమా స్టైల్లో ఏటీఎంలో లూటీ, సీసీటీవీలకు కలర్ స్ప్రే, ఏటీఎం మిషన్ కు గ్యాస్ కట్టర్ గిఫ్ట్!
బెంగళూరు/విజయపుర: ఉద్దరగా డబ్బులు కావాలంటే అక్రమ మార్గాల్లో వెళ్లాలని దొంగలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇళ్లలో చోరీలు చేస్తున్న నిందితులు ఇప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. భారీ మొత్తంలో నగదుకు మాత్రమే స్కెచ్ వేస్తున్నారు.
బెంగళూరు నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఏటీఎం యంత్రాల్లో నగదు లూటీ చెయ్యడానికి దొంగలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏటీఎం యంత్రాలు పగలగొట్టిన దొంగలు భారీ మొత్తంలో డబ్బులు లూటీ చేసి పారిపోయారు. పలుప్రాంతాల్లో ఏటీఎం యంత్రాలు పగలగొట్టి డబ్బులు చిక్కకపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లిపోయారు.

అయితే ఖతర్నాక్ దొంగలు ఏటీఎం యంత్రంలో డబ్బులు లూటీ చెయ్యడానికి సినిమా స్టైల్లో స్కెచ్ వేశారు. ఏటీఎం యంత్రంలో డబ్బులు లూటీ చెయ్యడానికి దొంగలు ఏకంగా గ్యాస్ కటింగ్ మిషన్ ఎత్తుకుని వెళ్లారు. కర్ణాటకలోని విజయపుర తాలుకాలోని శివణగి ప్రాంతంలో ఇండియా వన్ బ్యాంక్ ఏటీఎం యంత్రం ఉంది. ఈ ఏటీఎంలో నగదు నిల్వ చేస్తుంటారు.
ఇండియా వన్ బ్యాంక్ ఏటీఎం యంత్రంలో ప్రతిరోజు స్థానికులు డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. రాత్రి ఏటీఎం యంత్రంలోకి గ్యాస్ కట్టర్ ఎత్తుకుని వెళ్లిన దొంగలు నగదు లూటీ చెయ్యడానికి ప్రయత్నించారు. ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ముఖాలు గుర్తు పట్టకుండా ఉండటానికి నిందితులు భలే స్కెచ్ వేశారని వెలుగు చూసింది.
ఏటీఎం యంత్రంలోకి వెళ్లే ముందు నిందితులు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు కలర్ స్ప్రే కొట్టిన నిందితులు తరువాత ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం యంత్రం కట్ చేసిన నిందితులు అందులో ఉన్న నగదు మొత్తం లూటీ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం యంత్రంలో ఉన్న లక్షలాది రూపాయల నగదు లూటీ చేశారని, ఏటీఎం కేంద్రంలో వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications