Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థర్డ్ వేవ్ వార్నింగ్: ఆగస్టులో కంపల్సరీ, రోజుకు లక్ష కేసులు: ఐసీఎంఆర్ సైంటిస్ట్ వార్నింగ్

కరోనా థర్డ్ వేవ్ భయాందోళన కలిగిస్తోంది. రేపు, మాపు అని భయపెడుతోంది. అయితే మూడో వేవ్‌పై రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఒకరు దీనిపై స్పష్టత ఇచ్చారు. మూడో వైవ్ ఆగస్టులో వస్తుందని చెప్పారు. అంతేకాదు క్రమంగా రోజుకు లక్ష కేసుల చొప్పున నమోదు అవుతాయని ప్రొఫెసర్ సమిరన్ పాండా పేర్కొన్నారు.

 Third Covid-19 wave likely in August, India to see 1 lakh cases daily

అయితే పరిస్థితి మాత్రం ఫస్ట్ వేవ్ మాదిరిగానే ఉంటుందని వివరించారు. కానీ తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఐసీఎంఆర్‌లో ఎపిడెమోలాజీ, సంక్రమణ వ్యాధు విభాగానికి పాండా అధిపతిగా ఉన్నారు. సిచుయేషన్ ఎలా దిగజారుతుందని ప్రశ్నిస్తే.. ఐసీఎంఆర్, లండన్ ఇంపిరీయల్ కాలేజీ చేసిన పరిశోధనను వివరించారు. తక్కువగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా కేసులు పెరగవచ్చని.. కానీ సెకండ్ వేవ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అని తెలిపారు.

సామూహిక సమావేశాలను, మాస్క్ ధరించకపోవడం వల్ల ఇన్ ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ మందగించిందని.. ఇదీ ప్రమాదం అని పాండా తెలిపారు. పర్యాటకులను అనుమతి ఇవ్వడం, ఇతర ప్రాంతాలకు జనం చేరడంతో ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఇప్పుడు డెల్టా వెరియంట్ ద్వారా 86 శాతం మందికి ఇన్ ఫెక్షన్ వస్తుందని వివరించారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కేవలం 9.8 శాతం మందికి మాత్రమే కేసులు వచ్చాయి. అలాగే 0.4 శాతం మాత్రమే మరణాలు సంభవించాయని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+