దొంగతనం చేశారని థర్డ్‌డిగ్రీ: మూత్రం తాగించిన ఎస్ఐ
లక్నో: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని చిత్రహింసలకు గురిచేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతోపాటు చిత్రహింసలకు గురిచేసినందుకు బాధ్యుడైన ఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బరిచా జిల్లాలోని దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. సోను(23), కాలు(24) అనే ఇద్దరు యువకులే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా ఎస్ఐ అజిత్ వర్మ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. అంతటితో ఆగకుండా వారితో మూత్రం తాగించాడు. కరెంట్ హీటర్‌పై మూత్రం పోయించాడు. అంతేగాక, వారి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోశాడు. చిత్రహింసలకు గురైన ఆ ఇద్దరు యువకుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.
కాగా, బుధవారం సాయంత్రం వారిని ఇంటికి పంపించారు పోలీసులు. తమ కుమారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు యువకులను ఉన్నతాధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, వీరిలో ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బాధ్యుడైన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకుల బంధువులు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. విచారించిన ఉన్నతాధికారులు.. సదరు ఎస్ఐ అజిత్ వర్మను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications