వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం,' బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ: ముఖ్యాంశాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అదివారం ఢిల్లీలో బీజేపీ కార్యగోష్ఠిని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికే ఎన్టీఏ ప్రభుత్వం అంకితమైందన్నారు. సంక్షేమ పథకాలపై ఎంపీలకు వివరించారు. మనపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.

ముఖ్యాంశాలు:

* భారత్‌లో బలమైన ప్రతిపక్షముంటేనే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

* యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేసానికి సురక్షితంగా తరలించామన్నారు.

* దీనిపై మంత్రి వికె సింగ్‌ సమర్థవంతంగా పనిచేశారని అన్నారు.

'This is a Government for the Poor,' PM Modi Tells BJP Lawmakers: Highlights

* అవినీతిరహిత భారత్‌ను నిర్మించాలన్నేద తన లక్ష్యమని అన్నారు.

* అంతరిక్షం, అణుశక్తి రంగంలో భారత్ తనదైన ముద్ర వేసుకుందన్నారు.

* కెనడా నుంచి భారత్‌కు ఐదేళ్ల పాటు యూరేనియం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు.

* భారత్‌లో పెట్టుబడులకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

* పేదలను ధనికులుగా మార్చడమే మన లక్ష్యమని అన్నారు.

* దళితులు, గిరిజనుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.

* ఇలాంటి వారి కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

* పేదలకు ఇళ్లు, విద్యుత్ అందించడం తన కల అని, అందుకు ఎంపీలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు.

* గ్రామీణ వికాస్ యోజనలో ఎంపీలు భాగస్వాములవడం ఇదే తొలిసారని గుర్తు చేశారు.

* దేశంలోని 4 లక్షల మంది ప్రజలకు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.

* ధనికులు గ్యాస్ రాయితీలు వదులుకోవడం ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

* దీంతో దేశంలోని ఎక్కువ మంది పేదలకు గ్యాస్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.

* ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని విజయ వంతం చేసినందుకు బ్యాంకులకు అభినందనలు తెలిపారు.

* దీంతో బ్యాంకుల్లో 14,000 వేల కోట్లు జమ అయ్యాయి. నగదు డిపాజిట్ చేయడం అలవాటుగా మారిందన్నారు.

* పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యయ వందో పుట్టిన రోజు సందర్భంగా పేద ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు గుర్తించేలా పనులు చేయాలని సూచించారు.

English summary
Prime Minister Narendra Modi addressed a workshop for BJP lawmakers on the various pro-poor programmes of the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X