వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆందోళన .. భారత్ అంతర్గత సమస్య ..లండన్ నిరసనల వెనుక అజెండా ఇదే .. ఇండియన్ ఎంబసీ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా సెంట్రల్ లండన్ లో వేలాదిమంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చాలా మంది కరోనా నిబంధనలు ఉల్లంఘించారని, దాని కారణంగా పోలీసులు వారిని అరెస్టు చేశారని సమాచారం . బ్రిటీష్ రాజధాని ప్రధాన నగరమైన ఆల్డ్‌విచ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో నిరసనకారులు , ట్రాఫాల్గర్ స్క్వేర్ ప్రాంతం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు . ఈ ఆందోళనపై ఇండియన్ ఎంబసీ స్పందించింది .

డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయం డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయం

అనుమతి లేకుండా వేలాదిమంది ఎలా సమావేశం అవుతారని ప్రశ్నించిన ఎంబసీ

అనుమతి లేకుండా వేలాదిమంది ఎలా సమావేశం అవుతారని ప్రశ్నించిన ఎంబసీ


వేలాది మందితో నిర్వహించిన నిర్దిష్ట అనుమతి లేకుండా ఈ సమావేశం ఎలా జరుగుతుందని భారత హై కమిషన్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి భారత వ్యతిరేక వేర్పాటువాదులు నాయకత్వం వహించారని భారత రాయబార కార్యాలయం పేర్కొంది .
ఈ సమావేశానికి భారత వ్యతిరేక వేర్పాటువాదులు నాయకత్వం వహించారని, భారతదేశంలోని రైతులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశంలో నిరసనలకు అవకాశం కల్పించినప్పటికీ, వారి స్వంత భారత వ్యతిరేక ఎజెండా కోసం వారంతా సెంట్రల్ లండన్ లో ఆందోళన చేశారని అభిప్రాయపడుతున్నారు.

ఇది భారతదేశ అంతర్గత సమస్య అన్న భారత హై కమీషన్

ఇది భారతదేశ అంతర్గత సమస్య అన్న భారత హై కమీషన్

భారతదేశంలో వ్యవసాయ సంస్కరణ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన ఇండియా యొక్క అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని ప్రభుత్వ వైఖరిని హైకమిషన్ పునరుద్ఘాటించింది. భారత ప్రభుత్వం నిరసనకారులతో చర్చ జరుపుతోందని, ఇది భారతదేశం యొక్క అంతర్గత సమస్య అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని భారత హై కమిషన్ ప్రతినిధి పేర్కొన్నారు.

భారతదేశంలో జరిగిన నిరసనలపై బ్రిటిష్ సిక్కు లేబర్ ఎంపి తన్మన్‌జీత్ సింగ్ ధేసీ నేతృత్వంలోని 36 మంది బ్రిటిష్ ఎంపీల బృందం యుకె విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌కు లేఖ రాసిన తరువాత ఈ నిరసన వ్యక్తం చేశారు.

 రైతుల ఉద్యమానికి మద్దతుగా లండన్ లోనూ కొనసాగిన ఆందోళనపై ఎంబసీ తీవ్ర అసహనం

రైతుల ఉద్యమానికి మద్దతుగా లండన్ లోనూ కొనసాగిన ఆందోళనపై ఎంబసీ తీవ్ర అసహనం


పంజాబ్ రైతులకు మద్దతుగా లండన్ లో నిర్వహించిన ఆందోళనలో "జస్టిస్ ఫర్ ఫార్మర్స్" అన్న నినాదంతో , రోడ్లను బ్లాక్ చేయండి వంటి సందేశాలతో ప్లకార్డ్ లు ప్రదర్శించారు. కార్లను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు . బ్రిటిషు సిక్కులతో కూడిన బృందం ఆందోళన చేసిందని, అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయని, ఆందోళనలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశామని, జరిమానాలు విధించామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కానీ ఇండియన్ హై కమీషన్ మాత్రం ఈ ఆందోళనల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది .

English summary
High Commission of India questioned how the meeting could have taken place without the specific permission of thousands of people. The Indian embassy said the meeting was led by anti-India separatists. It is believed that the meeting was led by anti-India separatists who, despite the opportunity for protests in India to support Indian farmers, were all agitating in central London for their own anti-India agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X