వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home tips for Corona:యువతకు కోవిడ్ సోకితే ఇంట్లోనే ఉంటూ ఇలా చికిత్స తీసుకోండి..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ఏ స్థాయిలో విజృభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. అయితే మనం తీసుకునే జాగ్రత్తలే మన ప్రాణాలకు భరోసా ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇంట్లోనే ఉంటూ యువత ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలని చెబుతున్నారు.

కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,తలనొప్పి, ఒంటినొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు. పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు మాస్కులు ధరించాల్సి ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇంట్లో కిటికీలు తెరిచి ఉండండి. నిత్యం పానీయాలు తీసుకోండి. జ్వరం వస్తే పారాసిటామాల్ దగ్గర ఉంచుకోండి..

ఆక్సిజన్ లెవెల్స్ 92శాతం కంటే ఎక్కువగా ఉంటే...

ఆక్సిజన్ లెవెల్స్ 92శాతం కంటే ఎక్కువగా ఉంటే...

జ్వరంకు పారాసిటామల్ తీసుకోండి. ద్రవ పదార్థాలు తీసుకోండి. మీ కడుపుపై వెల్లికిల పడుకోండి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు చేరే ఆక్సిజన్‌ పెరుగుతుంది.బుడెసొనాయిడ్ రోజుకు రెండు పఫ్‌లు తీసుకోండి. కరోనా లక్షణాలు తగ్గే వరకు ఇలా చేయండి.

ఆక్సిజన్ లెవెల్స్ 92శాతం కంటే తక్కువగా ఉంటే...

ఆక్సిజన్ లెవెల్స్ 92శాతం కంటే తక్కువగా ఉంటే...

వైద్యుడిని వెంటనే సంప్రదించండి. వైద్యుల సలహా మేరకు ఈ కింది ట్రీట్‌మెంట్ తీసుకుంటే వ్యాధి నయమవుతుంది. వెల్లకిలా పడుకోవాలి. ఆక్సిజన్ తీసుకోవాలి. రోజుకు 4-6 సార్లు ఆక్సిజన్ లెవెల్స్‌ను మానిటర్ చేయాలి. డెక్సామెథాసోన్ (స్టెరాయిడ్) 6ఎంజీ మాత్ర తీసుకోవాలి లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇలా 5-10 రోజుల వరకు చేయాలి. ఒక వేళ ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయంటే ఐదు రోజుల తర్వాత ఈ స్టెరాయిడ్‌ను మానేయొచ్చు.

రెమ్‌డెసివిర్ మెడిసిన్

రెమ్‌డెసివిర్ మెడిసిన్

ఇక రెమ్‌డెసివిర్ మెడిసిన్ లక్షణాల వ్యవధిని తగ్గిస్తుంది తప్ప కోవిడ్-19 వల్ల సంభవించే మరణాన్ని నిలువరించలేదు. వైద్యుల సలహా సూచనమేరకే ఈ డ్రగ్ తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు గుర్తిస్తే రెమ్‌డెసివిర్‌ను ఇవ్వొచ్చు. టోసిల్‌జుమాబ్: ఇది కూడా వైద్యుల సలహా సూచనమేరకే తీసుకోవాలి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఆక్సిజన్ ఎక్కువగా అవసరమైన సమయంలో ఈ మెడిసిన్ తీసుకోవాలి. పై వన్నీ వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు.

English summary
When the Covid symptoms are identified in youth they can sit at home and follow few home remedies on the advise of doctors.కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అనంతరం ఇంట్లోనే ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X