ఆ స్టార్ హీరోపై క్రష్.. కానీ అలా అనేసరికి షాక్ అయ్యా - స్టార్ హీరోయిన్ సోదరి
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన స్టైల్, వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు స్టార్ హీరో Ajith Kumar. కమర్షియల్ సినిమాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, క్లాస్ కథలు.. ఏ జానర్ అయినా తనదైన ముద్ర వేస్తూ అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా తన సింప్లిసిటీ, ఆఫ్-స్క్రీన్ అటిట్యూడ్ కారణంగా ఆయనకు "తలా" అనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక ఇటీవలి కాలంలో అజిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ ప్రారంభంలో ఆయనకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు, గాసిప్స్ అప్పట్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. పలువురు హీరోయిన్లు ఆయనపై అభిమానం చూపించారని, మరికొందరు ప్రేమలో పడేయాలని ప్రయత్నించారని సినీ వర్గాల్లో అప్పట్లో టాక్ వినిపించేది. ఈ నేపథ్యంలో, అజిత్‌తో కలిసి నటించిన హీరోయిన్ Maheshwari చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటి Sridevi సోదరిగా పరిచయం ఉన్న మహేశ్వరి, తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆమెకు తెలుగులో 'గులాబి', 'పెళ్లి' వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తమిళంలో అజిత్‌తో కలిసి Nesam, Ullasam చిత్రాల్లో నటించిన సమయంలో ఆయనపై తనకు క్రష్ ఏర్పడిందని మహేశ్వరి వెల్లడించారు. ముఖ్యంగా 'ఉల్లాసం' షూటింగ్ చివరి రోజు, అజిత్‌ను మళ్లీ కలుసుకోలేనేమోనన్న భావనతో తాను బాధపడ్డానని తెలిపారు. ఆ సమయంలో అజిత్ స్వయంగా ఆమె వద్దకు వచ్చి, "నువ్వు నాకు చెల్లెలి లాంటి దానివి" అని చెప్పారట. ఆ ఒక్క మాటతోనే తనలో ఉన్న క్రష్ పూర్తిగా పోయిందని మహేశ్వరి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
జెంటిల్‌మ్యాన్ ఇమేజ్..
ఇక ఈ కథ బయటకు వచ్చిన తర్వాత, అజిత్ అభిమానులు ఆయనను "రియల్ జెంటిల్‌మ్యాన్"గా అభివర్ణిస్తున్నారు. సహనటులతో గౌరవంగా వ్యవహరించడం, వ్యక్తిగత పరిమితులను కచ్చితంగా పాటించడం ఆయన ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న గౌరవానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం అజిత్, దర్శకుడు Adhik Ravichandran దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలతో పాటు రేసింగ్‌లో పాల్గొంటూ.. రెండు రంగాలను సమతౌల్యంగా కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications