రైల్వే స్టేషన్‌లో ఇక 'భోలు' సాయం. దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆవిష్కరణ..

రైల్వే స్టేషన్‌కు వెళ్లగానే మనకు గుర్తొచ్చే మొదటి ప్రశ్న.. 'నా రైలు ఏ ప్లాట్‌ఫారమ్ మీదకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది?'. ఇలాంటి సందేహాల కోసం విచారణ కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడే పని లేకుండా, దక్షిణ మధ్య రైల్వే (SCR) సరికొత్త విప్లవానికి నాంది పలికింది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే "భోలు మినీ" - "భోలు మాక్స్" అనే స్మార్ట్ సహాయక వ్యవస్థలను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఈ అధునాతన వ్యవస్థపై శుక్రవారం లైవ్ డెమో నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ ప్రయోగాన్ని పరిశీలించి, హైదరాబాద్ డివిజన్ బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డీసీఎం డాక్టర్ అనిరుధ్ పామర్ తన సొంత మేధస్సుతో, అంతర్గతంగా సాఫ్ట్‌వేర్ కోడింగ్ రూపొందించి ఈ ఏఐ అసిస్టెంట్లను అభివృద్ధి చేయడం విశేషం.

Revolutionary AI Inquiry Systems in SCR Bholu Max Supports 12 Indian Languages at Kacheguda Station

మల్కాజిగిరిలో 'భోలు మినీ'.. కాచిగూడలో 'భోలు మాక్స్'

ప్రయోగాత్మకంగా ఈ ఏఐ కియోస్క్‌లను రెండు కీలక స్టేషన్లలో ఏర్పాటు చేశారు:

భోలు మినీ (మల్కాజిగిరి):

ఇది ప్రధానంగా ప్రాంతీయ భాషా ప్రేమికుల కోసం రూపొందించబడింది. తెలుగులో మాట్లాడే ఈ వాయిస్ అసిస్టెంట్, 'హలో' అని అనగానే స్పందిస్తుంది. రైలు సమాచారం, ప్లాట్‌ఫారమ్ వివరాలను 24/7 అందిస్తుంది.

వందే భారత్ vs అమృత్ భారత్ రెండు రైళ్లకు తేడా ఇదే ? ఏది బెస్ట్ ??
వందే భారత్ vs అమృత్ భారత్ రెండు రైళ్లకు తేడా ఇదే ? ఏది బెస్ట్ ??

భోలు మాక్స్ (కాచిగూడ):

ఇది భోలు మినీకి అధునాతన వెర్షన్. ఇందులో 21 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా, 12 భారతీయ భాషల్లో ప్రయాణికులతో సంభాషిస్తుంది. ప్రత్యక్ష రైలు ట్రాకింగ్, స్టేషన్ సౌకర్యాల వివరాలను ఇది అందిస్తుంది.

మరో కొత్త అమృత్ భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం
మరో కొత్త అమృత్ భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం

ప్రత్యేకతలు ఇవే..

ఈ ఏఐ వ్యవస్థలు రైల్వే డేటాబేస్‌తో అనుసంధానమై ఉండటం వల్ల అత్యంత కచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్ డేటాబేస్ సాయంతో నిరంతరాయంగా సేవలను అందించడం వీటి మరో ప్రత్యేకత. వీటి వల్ల విచారణ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు వేగంగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి, భవిష్యత్తులో జోన్ వ్యాప్తంగా ఉన్న అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఈ 'భోలు' అసిస్టెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+