మద్యం ధరలు భారీగా పెంపు, ఈ బ్రాండ్లపై బాదుడు - కొత్త ధరలు ఇలా..!?

మందుబాబులకు భారీ షాక్. మద్యం ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్దమైంది. కొన్ని రోజు లుకా ధరల పెంపు ప్రతిపాదనల పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో పెంపు దిశగా తుది నిర్ణయం వెల్లడించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ సారి ధరల పెంపు తో ఎంపిక చేసిన బ్రాండ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ధరలను సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. మందు బాబులకు ధరల షాక్ భారీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగేందుకు తుది కసరత్తు జరుగుతోంది. రెండేళ్ల కాలంగా మద్యం ధరల్లో మార్పు లేదు. తాజాగా మారుతున్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మద్యం తయారీ.. ముడిసరుకుల పెరుగుదల కారణంగా అమ్మకం ధర పెంచాల్సి వస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బాటిల్స్ తయారీకి అయ్యే వ్యయం గణనీయంగా పెరిగిందని డిస్టిలరీ కంపెనీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2023 మేలో చివరిసారిగా ధరలు పెరిగాయి. 2025లోనే ధరలు సవరించాలని కంపెనీలు కోరినప్పటికీ.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాగా.. ఇప్పుడు డిస్టలరీ లు ధరల పెరుగుదల పైన తమ వాదన బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న భారం తో ధరల సవరణ అనివార్యమని కంపెనీలు ఒత్తిడి తెస్తుండటంతో పెంపు ఖాయంగా కనిపిస్తోంది.

చల్లటి కబురు, ఈ నెలలోనే రుతుపవనాలు - తెలుగు రాష్ట్రాల్లో ఇలా...!!
చల్లటి కబురు, ఈ నెలలోనే రుతుపవనాలు - తెలుగు రాష్ట్రాల్లో ఇలా...!!
telangana-excise-all-set-to-increase-premium-brands-could-see-an-increase-of-up-to-100-per-full-bot

కమిటీ సిపార్సులు .. పెంపు ప్రతిపాదనలు

కాగా, మద్యం ధరల పెంపు పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వచ్చే వారం సమావేశమై తుది నివేదిక ఇవ్వనుంది. కాగా.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్‌పై రూ.100 వరకు, హై ఎండ్ బ్రాండ్స్‌పై రూ.120 వరకు పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కనిపిస్తోంది. అయితే కంపెనీలు కోరుతున్న స్థాయిలో పెంపు చేస్తే వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే అంశాన్ని నివేదికలోనూ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. మద్యం ధరలు పెరిగితే వచ్చే ఇతర సమస్యల పైనా చర్చ జరుగుతోంది. దీంతో.. ధరల పెంపు ఖాయమైనా.. ఏ స్థాయిలో పెంచాలనేది ఆలోచించి ఖరారు చేయనున్నారు. కాగా.. ధరలు పెంచటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రతీ నెలా దాదాపు రూ 250 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం మద్యం కొత్త ధరల పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+