తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యం- థోళ్ తిరుమావళన్ యూటర్న్
అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కజగం.. బరిలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితా వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల పర్వం తుదిదశకు చేరుకుంది. టీవీకే చీఫ్ విజయ్ సహా పలువురు ఆయా పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే తన మిత్రపక్షం విడుదలై చిరుతైగళ్ కచ్చి అధినేత థోళ్ తిరుమావలన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్నారు. ఈ పార్టీకి డీఎంకే మొత్తం ఎనిమిది సీట్లను కేటాయించింది. ఇందులో కట్టుమన్నార్ కోవిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తొలుత తిరుమావళవన్ ప్రకటించారు. తాజాగా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనకు బదులుగా కొత్త అభ్యర్థిని కూడా ఖరారు చేశారాయన.

తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడుతో పొత్తులో ఉంది. గత 2021 అసెంబ్లీ ఎన్నికలలో, DMK పార్టీ VKCకి మొత్తం 6 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. వీటిలో VKC అభ్యర్థులు 4 సీట్లను గెలుచుకున్నారు. దీని తర్వాత, ఈసారి రెండంకెల సంఖ్యలో సీట్లు కేటాయించాలని వీకేసీ డీఎంకేను కోరింది. కానీ డీఎంకే దానికి అంగీకరించకపోవడంతో, 8 సీట్లను కేటాయించింది.
తిరుమావళవన్.. చిదంబరం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ దఫా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తొలుత భావించారు. కట్టుమన్నార్ కోవిల్ నుంచి పోటీ చేస్తాననీ ప్రకటించారు. ఇది వీకే పార్టీకి కంచుకోట. ఆ పార్టీకి చెందిన చింతన సెల్వన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో తిరుమావళవన్ పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పుడాయన బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
దీనికి గల కారణాలను తిరుమావళన్ వెల్లడించారు. ఎంపీగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉందని, అయినప్పటికీ అణగారిన ప్రజల కోసం అసెంబ్లీకి రావాలని తొలుత నిర్ణయించుకున్నానని వివరించారు. మంత్రిపదవి కోసమే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నాననే ఆరోపణలు వస్తోన్నాయని, వాటిని తిప్పికొట్టడం అవసరం ఉందని అన్నారు. తనకు పదవీ కాంక్ష లేదనే విషయాన్ని తెలియజేయడానికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోన్నానని పేర్కొన్నారు. తనకు బదులుగా జ్యోతిమణి పోటీ చేస్తారని అన్నారు.
-
Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత? -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
Kerala Survey: కేరళలో గెలిచేది వాళ్లే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications