జై శ్రీరాం ఎఫెక్ట్? దీదీ తలకు వెల.. కోటి నజరానా ఇస్తానని లేఖ..
కోల్‌కతా : బెంగాల్‌లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఎన్నికలకు ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన ఓ లెటర్ కలకలం రేపింది. సీఎం మమతా బెనర్జీని తలకు వెలకడుతూ రాసిన లేఖపై తృణమూల్ నేతలు పోలీసులు ఆశ్రయించారు.

దీదీ తల తెస్తే కోటి నజరానా
తృణమూల్ ఎంపీ అపురూప పొద్దార్‌కు అందిన లేఖలో దుండగులు సీఎం మమత బెనర్జీపై అక్కసు వెళ్లగక్కారు. మమత ఫోటోను మార్ఫ్ చేసి రాక్షసురాలిగా మార్చారు. అంతటితో ఆగకుండా దీదీని చంపి తల తెచ్చినా.. సజీవంగా పట్టుకొచ్చినా వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. రాజీవ్ కిల్లా పేరుతో పూర్తి చిరునామా, మూడు ఫోన్ నెంబర్లతో కూడిన ఆ లేఖను ఎంపీ అపురూప శ్రీరాంపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

తనకు సంబంధంలేదన్న రాజీవ్ కిల్లా
మమత తలకు వెలకడుతూ రాసిన లెటర్‌పై తృణమూల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించేలోపే రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఎవరో తనపై కుట్రపన్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తన పేరుతో మమత తలకు వెలకట్టినట్లు లేఖ రాశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అపురూపకు అందిన లెటర్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని రాజీవ్ కిల్లా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జైశ్రీరాం నినాదాలతో దీదీని ఇబ్బందిపెడుతున్న బీజేపీ కార్యకర్తలే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని తృణమూల్ ఆరోపించింది.

గతంలోనూ దీదీపై విమర్శలు
బెంగాల్‌లో జై శ్రీరాం నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కక్ష గట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జై శ్రీరాం నినాదాలు చేస్తున్న వారిపై దీదీ కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ గతవారం మండిపడ్డారు. ఆమె రాక్షస జాతికి చెందిన వ్యక్తి అయినందునే అలా చేస్తున్నారని ఆరోపించారు. హిరణ్యక శివుడు తన ఇష్టదైవాన్ని తలచుకున్నందుకు తన కుమారుడు ప్రహ్లాదున్ని జైలులో పెట్టాడని, బెంగాల్‌లో ఇప్పుడు అదే పునరావృతం అవుతోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు.

ఎన్నికలకు ముందు నుంచి ఉద్రిక్తతలు
వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షలు కొనసాగుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 18స్థానాలు దక్కించుకుంది. దీంతో బెంగాల్‌లో దాడులు, ప్రతిదాడులు తీవ్రమయ్యాయి. ఇరుపక్షాలు పరస్పరం బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే మమత తల తెచ్చిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తామంటూ లేఖ వెలుగు చూడటం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications