మోడీ ర్యాలీ: బస్తు బోల్లా పడి ముగ్గురి దుర్మరణం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని భభ్రా మంగళవారం జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ర్యాలీకి వెళ్లిన వారు తిరిగివెళుతున్న సమయంలో బస్తు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తలు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆరు మందికి తీవ్రగాయాలైనాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలంమైన భభ్రాలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖార్గోన్ జిల్లా ప్రజలను స్కూల్ బస్సులలో తరలించారు.

బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి వెలుతున్న సమయంలో (బుధవారం వేకువ జామున) ఆలీరాజ్ పూర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసులు వెళ్లే సమయానికి ముగ్గురు అక్కడే చనిపోయారు.
తీవ్రగాయాలైన వారిని పోలీసులు ఖార్గోన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు, గాయాలైన వారు ఖార్గోన్ జిల్లా వాసులని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications