చరిత్ర తిరగరాస్తారా ?, పోటీలో ముగ్గురు మాజీ సీఎంలు, మోదీ అభయం, అధికార పార్టీకి దెబ్బ !
లోక్‌సభ ఎన్నికల పోరుకు రోజులు దగ్గర పడుతున్నాయి. బీజేపీ, జేడీఎస్‌లు పొత్తుపెట్టుకుని కర్ణాటకలోని 28 లోక్‌సభ సీట్లు గెలుచుకుని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి రుచి చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. 28 స్థానాలకు గాను 20 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకోగా బీజేపీ కౌంటర్ స్ట్రాటజీగా 28 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ముగ్గురు మాజీ సీఎంలను బీజేపీ రంగంలోకి దింపింది. అందులో ఒక మాజీ సీఎం జేడీఎస్ సింబల్ మీద బరిలోకి దిగారు. బీజేపీ హైకమాండ్ సూచనల మేరకు ముగ్గురు మాజీ సీఎంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం వీరప్ప మొయిలీ టికెట్ డిమాండ్ చేసినా చివరి క్షణంలో ఆయనకు టికెట్ దక్కలేదు.

ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి ఉంటే ఆ పార్టీ నుంచి మరో మాజీ సీఎం రంగంలోకి దిగి ఉండేవారు. అలాగే బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం డీవీ సదానంద గౌడకు టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించడంతో ఆయన లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ ఇద్దరు పోటీ చేసి ఉంటే కర్ణాటకలో ఐదు మంది మాజీ సీఎంలో పోటీలో ఉండేవారు. అయితే ఇప్పుడు ముగ్గురు మాజీ సీఎంలు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. బీజేపీ మద్దతుతో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బరిలో ఉండగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ముగ్గురు సీఎంలు గెలుస్తారా అనే ప్రశ్న తలెత్తింది.
పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ ఉనికి ప్రశ్నార్థకం కాగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేసిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ ఓడిపోయారు. తరువాత బెళగావి లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం జగదీష్ శెట్టర్ పోటీ చేస్తున్నారు. ఇక మరో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ హావేరి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇప్పటికీ రాష్ట్రంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను రంగంలోకి దింపిన బీజేపీ హైకమాండ్ సిద్దరామయ్య ప్రభుత్వానికి సినిమా చూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు ఓటముల లెక్కల్లో మునిగి తేలుతున్న ముగ్గురు మాజీ సీఎంల గత ఎన్నికల చరిత్ర ఓ తీపి కబురు అందిస్తోంది. గతంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు గెలిచినట్లు కర్ణాటక చరిత్ర చెబుతోంది. గత 72 ఏళ్లలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన 23 మందిలో 72% మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
కర్ణాటక రాష్ట్ర నాయకులకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కర్ణాటకలోని గత చరిత్ర తెలియజేస్తోంది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకను పాలించిన 23 మంది ముఖ్యమంత్రులలో 16 మంది ఎంపీలుగా పనిచేసినవారే. అలాగే వారిలో ఇద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యారు, మిగిలిన 14 మంది ప్రజలు ఓట్లు వెయ్యడంతో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ఎస్ నిజలింగప్ప, హెచ్‌డీ దేవేగౌడ, జేహెచ్ పటేల్, ఎస్ఎం కృష్ణ, ఎన్. ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామి, డీవీ సదానంద గౌడ సిఎం కాకముందు ఎంపీలుగా పనిచేశారు, కేసీ రెడ్డి, కే. హనుమంతయ్య, వీరేంద్ర పాటిల్, ఆర్ గుండూరావు, ఎస్. బంగారప్ప, వీరప్ప మొయిలీ, బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు జరిగే లోక్ సభ ఎన్నికల్లో ముగ్గురు మాజీ సీఎంల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications